రష్యా స్వాధీనంలోకి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సిటీ

Russia Occupies Kyiv Capital of Ukraine
x

రష్యా స్వాధీనంలోకి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ సిటీ

Highlights

ఉక్రెయిన్ రాజధానిలో రష్యా జెండా రెపరెపలు

Ukraine: ఉక్రెయిన్‌పై కన్నెర్రజేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుకున్నంత పనిచేశారు. ఉక్రెయిన్‌ను ఆక్రమించడమే లక్ష్యంగా రష్యా బలగాలు వేగంగా ముందుకు దూసుకెళ్తున్నాయి. రష్యా దళాలను అడ్డుకోవడానికి ఉక్రెయిన్‌ చేస్తున్న ప్రయత్నాలేవి ఫలించడం లేదు. యుద్ధం ప్రారంభించిన రెండో రోజే రష్యా బలగాలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ నగరంలోకి ప్రవేశించాయి. రాజధాని కీవ్‌పైనే ప్రధానంగా గురిపెట్టిన రష్యా.. నలువైపుల నుంచి చుట్టుముట్టి ఆక్రమించేశాయి. కీవ్‌ను రష్యా తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ విషయాన్ని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అధికారికంగా ప్రకటించారు. మరో 96 గంటల్లో రష్యా చేతుల్లోకి రాజధాని కీవ్‌ వెళ్లనుందని తెలిపారు. వైమానిక దాడులు జరిగే ప్రమాదం ఉందని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని సూచించారు. తనను చంపడమే రష్యా టార్గెట్‌ అని, తన కుటుంబం హత్యకు ప్లాన్‌ చేస్తున్నారని అన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories