Russia: స్కూలు పిల్లలను పిల్లలు కనమని చెబుతోన్న రష్యా.. పిల్లలను కంటే భారీ పారితోషికం

Russia
x

Russia: స్కూలు పిల్లలను పిల్లలు కనమని చెబుతోన్న రష్యా.. పిల్లలను కంటే భారీ పారితోషికం

Highlights

Russia: చైనా, భారత్ వంటి దేశాలు పిల్లలను కనడం తగ్గించండి అని మొత్తుకుంటే రష్యా పిల్లలను బాగా కనండి.. కన్నవాళ్లకి భారీ పారితోషికాలు ఇస్తామని చెబుతోంది.

Russia: చైనా, భారత్ వంటి దేశాలు పిల్లలను కనడం తగ్గించండి అని మొత్తుకుంటే రష్యా పిల్లలను బాగా కనండి.. కన్నవాళ్లకి భారీ పారితోషికాలు ఇస్తామని చెబుతోంది. ముఖ్యంగా స్కూలుకు అంటే డిగ్రీలు చదివే పిల్లలు ఒకవేళ పెళ్లి చేసుకుని పిల్లలు కంటే వారి భారీగా బహుమతులను అందజేస్తామని రష్యా ప్రభుత్వం గత కొంతకాలం నుంచి ప్రకటనలు చేస్తుంది. ఇంతకీ రష్యా ప్రభుత్వం ఈ ప్రకటన చేయించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి.. ఇప్పుడు తెలుసుకుందాం.

రష్యా జననాల రేటు గణంగా తగ్గిపోతూ వస్తుంది. అందుకే ఆరోగ్యపరమైన పిల్లలను కనే 25ఏళ్ల అమ్మాయిలకు లక్ష రూపాయల వరకు ఇస్తామని రష్యా ప్రభుత్వం ప్రకటించింది. గతంలోనూ రష్యా పలుమార్లు ఈ ప్రకటనను చేసింది. అయితే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే.. ఈ అమ్మాయిలు రష్యాకు చెందినవారై మాత్రమే ఉండాలి.

2024 లెక్కల ప్రకారం చూస్తే.. ఆదేశంలో జననాల రేటు బాగా పడిపోయింది. గత సంవత్సరం కేవలం దాదాపు 6 లక్షలమంది వరకు మాత్రమే పిల్లలు పుట్టారు. అంతుకుముందు కంటే 16వేలు తక్కువ కావడంతో 2025 జనవరి నుంచి 25 లోపు అమ్మాయిలు పిల్లలు కంటే పారితోషికాలు ఇస్తామని ప్రకటన చేయిస్తోంది.

అయితే ఆరోగ్యకరమైన బిడ్డలకు జన్మనిచ్చిన వారికి మాత్రమే ఈ బహుమతిని అందజేస్తుంది. చనిపోయిన బిడ్డకు జన్మనిస్తే ఇది వర్తించదు. అయితే మిగిలిన విషయాల్లో ఏదీ ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. అయితే అసలు రష్యాలో జనాభా ఎందుకు తగ్గుతుంది. ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? అంటే గత కొన్నేళ్లుగా ఆ దేశంలో జనాభా తగ్గిపోతూ వస్తుంది. దీనికి ముఖ్యకారణం ఎక్కువమంది చనిపోవడం, తక్కువమంది పుట్టడం.

గత రెండు సంవత్సరాలుగా రష్యా ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తూనే ఉంది. దీనివల్ల దేశంలో యువకులను ఆర్మీలో చేర్చుకుని.. వారిని ఇంటికి దూరంగా రష్యా ప్రభుత్వం పంపించింది. దీంతో కుటుంబాలు చెల్లాచెదురై పోయాయి. దీంతో జననాల రేటు తగ్గిపోయింది. దీంతో పాటు ఇటీవల వస్తోన్న ఫాస్ట్ కల్చర్ కూడా దేశ జనాభాపై ప్రభావం పడుతుంది. పెళ్లికి ఒకేగానీ పిల్లలు వద్దన్న కాన్సెప్ట్ ఇప్పుడు చాలామందిలో కనిపిస్తుంది. దీనివల్ల కూడా దేశ జనాభా తగ్గిపోతూ వస్తుంది. అందుకే రష్యా ప్రభుత్వం ఇప్పుడు పదే పదే ఈ ప్రకటనలు చేస్తూ ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories