కుటుంబ వివరాలను పంచుకున్న రిషి సునక్‌.. భార్య అక్షత గజిబిజి వ్యక్తి అని..

Rishi Sunak On Married Life
x

కుటుంబ వివరాలను పంచుకున్న రిషి సునక్‌.. భార్య అక్షత గజిబిజి వ్యక్తి అని..

Highlights

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో రిషి సునక్‌ దూసుకెళ్తున్నారు.

Rishi Sunak: బ్రిటన్‌ ప్రధాని పదవి రేసులో రిషి సునక్‌ దూసుకెళ్తున్నారు. ప్రస్తుత ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటున్న రిషి సర్వేల్లో వెనుకబడిపోయాడు. తాజా వరుస డిబెట్లతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పలు చానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో రిషి జీవిత భాగస్వామి, ఇన్ఫోసిస్‌ ఫౌండర్ నారాయణ మూర్తి కూతురు అక్షతా మూర్తి గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. అక్షతా మూర్తి పరిచయం తన వివాహం వెనుక ఉన్న రహస్యాలను, ఆమె వ్యవహరించే తీరు కుటుంబంతో ఎలా గడుపుతున్నది రిషి సునక్‌ వెల్లడించారు.

బ్రిటన్ ప్రధాని పదవి రేసు చివరి స్టేజ్‌లో లిజ్‌ ట్రస్‌తో భారత సంతతికి చెందిన రిషి సునక్‌ పోటీ పడుతున్నారు. ఇటీవల డిబేట్లలో రిషి సునక్ దూసుకెళ్తున్నారు. సర్వేల్లోనూ వెనుక బడిన రిషి తాజాగా పుంజుకుంటున్నారు. వరుస టీవీ ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్న రిషి తాజాగా తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. బ్రిటన్‌లోని సౌతంప్టన్‌లో భారత సంతతికి చెందిన యశ్విర్, ఉషా సునక్‌ దంపతులకు జన్మించిన రిషీ విద్యంతా స్థానికంగానే సాగింది. ఎంబీఏ చదివేందుకు అమెరికాలోని స్టాన్‌పోర్డు యూనివర్సిటీకి వెళ్లిన ఆయనకు ఇన్ఫోసిస్‌ కో ఫౌండర్ నారాయణమూర్తి కూతురు అక్షతా మూర్తితో పరిచయం ఏర్పడింది. స్నేహం ప్రేమగా మారడంతో 2009 బెంగళూరులో పెద్దల సమక్షంలో ఇరువురు పెళ్లి చేసుకున్నారు. స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీ నుంచి ప్రస్తుత పెళ్లి వరకు తను, అక్షత తీరు, కుటుంబ బాధ్యతల వివరాలను రిషి వెల్లడించారు.

తాను పద్దతిగా ఉంటానన్న రిషి వస్తువులను చక్కగా అమర్చే అలవాటు ఉందని తెలిపారు. కానీ తన భార్య అక్షతా మూర్తి మాత్రం అన్నింటిని చిందరవందరగా పడేస్తుందన్నారు. తనేమో క్రమశిక్షణ ఉంటానని ఆమె మాత్రం సమయస్ఫూర్తితో ఉంటుందని రిషి వివరించారు. ఈ విషయాలు చెబితే అక్షతా మూర్తి ఇష్టపడదని.. ఆమెది పూర్తిగా చక్కబెట్టే తత్వం కాదన్నారు. ప్రతిచోట దుస్తులు ఎక్కడివక్కడే, బూట్లు ఎక్కడపడితే అక్కడే హో గాడ్‌..' అంటూ తన భార్య అక్షతా మూర్తి గురించి రిషి చెప్పారు. ఎంబీఏ చదివే సమయంలో తన పక్కన కూర్చోవాల్సిన అవసరం నాకు లేదు అయినా కానీ ఇద్దరం కలిసి పక్కనే వెళ్లి కూర్చునేవారమని రిషి కాలేజీ రోజులను గుర్తు చేసుకున్నారు. రిషి, అక్షతా మూర్తికి ఇద్దరు కూతుళ్లు 11 ఏళ్ల కృష్ణ, 9 ఏళ్ల అనౌష్క ఉన్నారు. పిల్లల విషయంలో తాను అదృష్టవంతుడినని రిషి తెలిపారు. ఎందుకంటే వాళ్లు పుట్టే సమయానికి నేను సొంత బిజినెస్‌ నడుపుతున్నాను. అందుకే వాళ్లతో గడపడానికి చాలా సమయం దొరికేది. అలా వాళ్లతో ప్రతిక్షణాన్ని ఎంతో ఆస్వాదించాను' అంటూ తన కుటుంబ విషయాలను రిషి సునాక్‌ పంచుకున్నారు.

పిల్లల సంరక్షణకు అవసరమైన సాయం చేయడానికి తాను ఇష్టపడుతానని రిషి తెలిపారు. ప్రచారంలో ఉన్నప్పడు కూడా చిన్నారి పాపలను చూస్తే నా చేయి వారివైపు ఆటోమెటిక్‌గా కదులుతుందన్నారు. పిల్లలంటే ఇష్టమని సునక్‌ తెలిపారు. తాను నిజాయితీగా ఉంటానని టోరీ నాయకుడు చెప్పారు. సంపన్నులైన భార్య భర్తలు ఓటర్లను అర్థం చేసుకోలేరని లిజ్‌ ట్రస్‌ చేసిన విమర్శలపైనా రిషి స్పందించారు. మనం వ్యక్తులను, వారి స్వభావాలను వారి చర్యలతో అంచనా వేస్తామని రిషి చెప్పారు. బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బును బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయరని మాజీ మంత్రి స్పష్టం చేశారు. డబ్బు సంపాదించడానికి తన కుటుంబం ఎంతో కష్టపడి పని చేసిందన్నారు. కష్టం విలువ తనకు తెలుసని అందుకే ప్రధాని పదవికి పోటీ పడుతున్నానని లిజ్‌ విమర్శలకు దీటుగా సమాధానమిచ్చారు. టోరీ లీడర్‌ పోటీలో నిర్వహించే పోల్‌ను ఎన్నికల్లా భావించడం లేదన్నారు. నేను ఎప్పుడూ బయట ఉండి ప్రజలతో మమేకమై ఉంటున్నట్టు తెలిపారు.

రిషి సునాక్‌ ఆర్థికశాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఆయన సతీమణి అక్షతా మూర్తి పన్నుల చెల్లింపు వ్యవహారం వివాదాస్పదమయ్యింది. దీంతో అధికారిక నివాసం డౌనింగ్‌ స్ట్రీట్‌లోని నంబరు 10 నుంచి ఖాళీ చేసి మరోచోటికి మారిపోయారు. అనంతరం అక్షతా మూర్తి వివాదం సద్దుమణిగింది. నెల రోజుల క్రితం కన్జర్వేట్వి నేతలు రాజీనామాలతో బోరిస్‌ జాన్సన్‌ దిగిపోవాలంటూ ఒత్తిడి తెచ్చారు. దీంతో ప్రధాని పదవికి బోరిస్‌ రాజీనామా చేశారు. దీంతో టోరీ లీడర్, ప్రధాని ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు జరిగిన అన్ని రౌండ్లలో రిషి సునక్‌ ఆధిక్యం సాధించారు. ఇప్పటివరకు ఎంపీలు అభ్యర్థులను ఎన్నుకున్నారు. చివరి రౌండ్‌లో మాత్రం టోరీ పార్టీ సభ్యులు ఎన్నుకోనున్నారు. చివరి రౌండ్‌లో రిషి సునక్‌, లిజ్ ట్రస్‌కు మధ్య పోటీ జరుగుతోంది. సర్వేలన్నీ లిజ్‌ ట్రస్‌కే అనుకూలంగా ఉన్నాయి. ఇటీవల సర్వేల్లో రిషి మెరుగుపడ్డారు.

ప్రస్తుతం బ్యాలెట్‌ పేపర్ల పంపిణీ ప్రక్రియ ఈ వారంలో మొదలు కానున్నది. సెప్టెంబరు 2 సాయంత్రం నాటికి టోరీ నేతలు తమ బ్యాలెట్‌ పేపర్లను అందించాల్సి ఉంటుంది. సెప్టెంబరు 5న టోరీ పార్టీ లీడర్‌‌తో పాటు బ్రిటన్ ప్రధాని అభ్యర్థిని ప్రకటించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories