జాత్యహంకార హత్య.. అమెరికాను కుదిపేస్తోంది!

జాత్యహంకార హత్య.. అమెరికాను కుదిపేస్తోంది!
x
Donald Trump(file photo)
Highlights

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి.

అమెరికాలో ఓ నల్లజాతీయుని హత్యకు నిరసనగా పెద్దఎత్తున నిరసనజ్వాలలు కొనసాగుతున్నాయి. ఏకంగా అధ్యక్షభవనం వైట్ హౌస్ వద్దే ఆందోళనకారులు.. పోలీసులతో ఘర్షణలు పడుతున్నారు. గత ఆరు రాత్రులుగా రాత్రిపూట ఆందోళనలకు దిగుతున్నవారిని ట్రంప్ దేశీయ తీవ్రవాదులు అనడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. పోలీసులు నిరసనకారులపై రబ్బర్ బుల్లెట్లు, పెప్పర్ స్ప్రే, టియర్ గ్యాస్ లను ప్రయోగించి చెదరగొట్టారు.

అమెరికాలో జార్జ్ ఫ్లాడ్ అనే ఆఫ్రికన్ అమెరికన్‌ని మినియా పొలీస్ నగర పోలీసు ఒకడు మెడపై కాలితో బలంగా నొక్కడంతో జార్జ్ మరణించాడు. ఈ దారుణానికి నిరసనగా గత నెల 25 నుంచే దేశవ్యాప్తంగా అల్లర్లు, ఘర్షణలు జరుగుతున్నాయి. తాజాగా ఆ నిరసనల సెగ వైట్ హౌస్‌ని కూడా తాకింది. భారీ సంఖ్యలో ఆందోళనకారులు వైట్ హౌస్ వద్ద గుమికూడి నిరసనలకు దిగారు.

వైట్ హౌస్ బయట ఇలా నిరసన కారులు ఒక్కసారిగా ఆందోళనలకు దిగడం, భద్రత బలగాలు, వారికి మధ్య ఘర్షణలు జరుగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని కొద్దిసేపు వైట్ హౌజ్ కింద ఉన్న బంకర్ లోకి తీసుకెళ్లారు. అత్యవసర సందర్భాల్లో అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం ఆ బంకర్ లోకి అమెరికా అధ్యక్షుడిని తరలిస్తారు. అల్లర్ల నేపథ్యంలో అరగంట, గంట మధ్య పాటు అధ్యక్షుడు ట్రంప్‌ని బంకర్‌లోకి వైట్ హౌస్ సెక్యూరిటీ సిబ్బంది తరలించారు.

గత ఆరు రాత్రులుగా రాత్రిపూట ఆందోళనలకు దిగుతున్నవారిని ట్రంప్ దేశీయ తీవ్రవాదులు అనడంతో నిరసనకారులు మరింత రెచ్చిపోయారు. ఎక్కడో మిన్నియాపులిస్ లో మొదలైన నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపించాయి. అమెరికాలోని ప్రధాన నగరాలలో రాత్రిళ్లు కర్ఫ్యూ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories