ట్రంప్ కొత్త ఎత్తుగడ.. భారత్‌కు సాయం చేస్తాం

ట్రంప్ కొత్త ఎత్తుగడ.. భారత్‌కు సాయం  చేస్తాం
x
Donald Trump(File photo)
Highlights

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను మచ్చిక చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు.

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్‌ను మచ్చిక చేసుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఇండియాకి వెంటిలేటర్లు డొనేట్ చేస్తానని ప్రకటించారు. కరోనా కాలంలో భారత్‌కి అండగా నిలుస్తామన్నారు. రెండు దేశాలు కలిసి కోవిడ్ వ్యాక్సిన్ తయారుచేసి కరోనా అంతు చూస్తాయని అన్నారు. వ్యాక్సిన్ తయారీలో భారత్, అమెరికా కలిసి ప్రయోగాలు చేస్తున్నా విషయం తెలిసిందే. ట్రంప్ చేసిన ట్వీట్ పై భారత్ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఓవైపు చైనాలో కంపెనీలు భారత్‌కి రాకుండాఅడ్డుపుల్లలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై ప్రేమ పుట్టుకు రావడంపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గత నెల్లో యాంటీ-మలేరియా డ్రగ్( హైడ్రాక్సీ క్లోరోక్విన్‌) విదేశాలకు ఎగుమతినిర్ణయం తీసుకుంటామని నిషేధాన్ని కేంద్ర ప్రభుత్వం ఎత్తి వేసింది. అప్పట్లో ఈ నిర్ణయంపై అమెరికా హర్షం వ్యక్తం చేసింది. తమ దేశంలో కరోనాపై పోరాటంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కీలకం కానుందని ట్రంప్ అన్నారు. ఆ తర్వాత ఇప్పుడు ట్రంప్ కూడా భారత్‌కి అనుకూల నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ ఇండియాకి తీరని ద్రోహం చేస్తున్నారని ఆర్ధిక నిపుణులు అంటున్నారు. "ఇండియాకు వెళ్తామని యాపిల్‌ కంపెనీ అంటోంది. అదే జరిగితే ఆ కంపెనీకి పన్ను పోటు తప్పదు" అని ట్రంప్ అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories