అమెరికాలో అసాధారణం.. యుద్ధ సమయాల్లో కనిపించే పరిస్థితి..

అమెరికాలో అసాధారణం.. యుద్ధ సమయాల్లో కనిపించే పరిస్థితి..
x
Coronavirus in America kirkland washington
Highlights

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌స్తుతం విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 8 లక్షలకు పైగా కేసులు న‌మోదు కాగా 40 వేల మందికి పైగా మృతి చెందారు.

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా ప్ర‌స్తుతం విల‌య తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కు 8 లక్షలకు పైగా కేసులు న‌మోదు కాగా 40 వేల మందికి పైగా మృతి చెందారు.సుమారు 200 దేశాల్లో కరోనా ప్రభావం ఉంది. అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాలు దీనికి వణికిపోతున్నాయి. వాస్తవానికి ఈ వైరస్ చైనాలో ఉద్భవించినా.. అమెరికాను గజ గజ వణికిస్తోంది. మొదట్లో ఒక్క కేసు నమోదైతేనే ఏముందిలే అనుకున్నారంతా.. కానీ ఇప్పుడు ప్రపంచంలో లక్షలాది కేసులు నమోదయ్యే దేశంగా అమెరికా తయారవబోతోంది. దీంతో ఏమి చెయ్యాలో అర్ధం కాక దిక్కుతోచని పరిస్థితి. కేసులు అతి త్వరలోనే 2 లక్షలకు రీచ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా అమెరికాలో మరణాల సంఖ్య చైనాలో మరణించినవారిని అధిగమించింది.

అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం , చైనా ప్రస్తుతం 3,309 మరణాలతో మూడో స్థానంలో ఉంటే.. అమెరికా ఈ సంఖ్య అధిగమించింది. ప్రస్తుతం 3,415 మరణాలు నమోదయ్యాయి, అంతేకాదు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 165,000 కేసులు నమోదయ్యాయి. కాగా అమెరికాలో రోజురోజుకు వందలాది కేసులు నమోదవుతున్నాయి.. కానీ చైనాలో మాత్రం వ్యాధి తీవ్రత క్రమంగా మందగించింది. అక్కడ పది రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు అంటే పరిస్థితి ఎంత అదుపులో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.. అమెరికాలో మాత్రం ఇందుకు భిన్న పరిస్థితులు ఉన్నాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమి చెయ్యాలో అర్ధం కాక తలపట్టుకున్నారు.

ఈ క్రమంలో పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు తీవ్ర నిర్ణయాలు తీసుకున్నారు అధికారులు. యుద్ధ సమయాల్లో కనిపించే క్షేత్రస్థాయి ఆసుపత్రులు న్యూయార్క్‌ సెంట్రల్‌ పార్క్‌లో ఏర్పాటయ్యాయి. అంతేకాదు మన్‌హట్టన్‌ సమీపంలో ఓ యుద్ధ నౌకలో సుమారు వెయ్యి పడకల కరోనా ఆస్పత్రిని సిద్ధం చేశారు. ఉపాధి కోల్పోయిన పలువురు నగరంలోని ఫుడ్‌బ్యాంకుల్లో ఆహారం కోసం క్యూ కడుతున్నారు. వీరికి యుద్ధప్రాతిపదికన ఆహరం సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు వైరస్ మరింతగా విజృంభిస్తున్న ప్రాంతాల్లో వేలాది వెంటిలేటర్లు..

ఇందుకోసం కొత్తగా 15 వేలకు పైగా వెంటిలేటర్లు సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు పలుప్రాంతాల్లో వేలాది ఐసోలేషన్ వార్డులను సిద్ధం చేశారు. ఈ ఏడాదిలో ఎన్నికలు కూడా వుండనుండటంతో ట్రంప్ నకు ఇది సవాల్ గా మారింది. ఏ మాత్రం అటు ఇటు అయినా ప్రమాదం ట్రంప్ నకె కాదు.. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీకి కూడా పెద్ద ప్రమాదమే అంటున్నారు పరిశీలకులు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories