మనిషి రక్తంలో ప్లాస్టిక్ కణాలు.. ఆరోగ్యంపై వివరీతమైన ప్రభావం...

Plastic Cells Found in Human Blood in Netherlands Research on 22 Members | Breaking News
x

మనిషి రక్తంలో ప్లాస్టిక్ కణాలు.. ఆరోగ్యంపై వివరీతమైన ప్రభావం...

Highlights

Plastic Cells in Blood: వాటర్ బాటిల్, ఇతర పానీయాలు,ఫుడ్ ప్యాకింగ్ ద్వారా ప్లాస్టిక్ రేణువుల ప్రయాణం...

Plastic Cells in Blood: ప్లాస్టిక్.. ప్రస్తుత సమాజంలో మానవాళి మనుగడ దీనిపైనే ఆధారపడింది.. ప్లాస్టిక్ ఎంత ప్రమాదమో మనకు తెలిసినా వాడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్లాస్టిక్ ఇంతకాలం పర్యావరణానికి మాత్రమే హాని చేస్తుంది.. మానవాళికి పరోక్షంగా మాత్రమే ప్రమాదమనుకున్నాం. కానీ ఇప్పుడు ప్లాన్టిక్ మనిషి రక్తంలోకి చేరింది.. మనిషి రక్తంలో ప్లాస్టిక్ కణాలు ఉన్నట్లు తొలిసారిగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది చాలా ఆందోళన కలిగించే పరిస్థితి. సత్వరమే దీనిని సరిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.

భూమిపై అత్యంత కాలుష్యకారకాల్లో ప్లాస్టిక్ ఒకటి. ప్లాస్టిక్ వ్యర్థాలు పెద్ద మొత్తంలో భూమిపై నుంచి సముద్ర జలాల్లోకి చేరుతున్నాయి. వీటిలో ఉండే చిన్న రేణువులు అంటే 5 మిల్లీ మీటర్ల కన్నా చిన్నగా ఉంటాయి.. అవే ఇప్పుడు మానవాళిని గడగడలాడిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి చేపలు.. ఇతర సీ ఫుడ్ లో కనిపించేవి. ఇప్పుడు మనిషి రక్తంలో వీటి కణాలు బయట పడటం ఆందోళన కలిగిస్తోంది.

నెదర్లాండ్స్ లో సైంటిస్టుల టీమ్ 22మంది నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలిస్తే 17 మందిలో ప్లాస్టిక్ రేణువులు కనిపించడం ఆందోళనకు గురిచేసింది. అయితే ఈ రేణువులు వివిధ మార్గాల్లో మనిషి రక్తంలోకి చేరుతున్నాయి. కొంత మందిలో పాలీ ఇథలీన్ టెరెప్టథలేట్ రేణువులు కనిపించాయి. వీటిని వాటర్ బాటిల్, ఇతర పానీయాల ప్యాకింగ్ లో వాడుతుంటారు. ఫుడ్ ప్యాకేజింగ్ లో వాడే పాలిస్టరీన్ రేణులు 36శాతం శాంపిల్లలో కనిపించాయి.

ప్లాస్టిక్ సంచుల తయారీకి ఉపయోగించే పాలీ ఇథలీన్ రేణువులు 23శాతం నమూనాల్లో కనిపించాయి. గాలి, ఆహారం, పానీయాల ద్వారా ఈ ప్లాస్టిక్ రేణువులు మనిషి బాడీలోకి ప్రవేశిస్తున్నాయి. రీసెర్చ్ లో తేలిన భయంకర వాస్తవం ఏమిటంటే.. ఒక మిల్లీ లీటరు రక్తంలో 1.6 మైక్రోగ్రాముల వరకు ఈ ప్లాస్టిక్ రేణువులు కనిపించాయి. ఇది చాలా ఆందోళనకరమైన పరిస్థితిగా శాస్త్రవేత్తలు తేల్చి చెప్తున్నారు. ఇవి రక్త ప్రవాహం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా అవుతాయని.. ఇది అవయవాల్లో పేరుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికిప్పుడు ప్రమాదం లేకున్నా దీర్ఘకాలంలో మనిషి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ప్లాస్టిక్ రేణువుల దాడి నుంచి బయటపడాలంటే.. ఇళ్లలో మంచి వెంటిలేషన్ ఉండాలి.. ఆహారం, తాగే పానియాలపై ప్లాస్టిక్ రేణువులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. బయట వాతావరణంలో కన్నా.. ఇళ్లలోనే ఈ రేణువులు ఎక్కువగా పేరుకుపోతున్నట్లు పరిశోధనలో తేలింది.మొత్తం మానవాళి మనుగడనే ప్రశ్నార్థకంలో పడేస్తున్న ప్లాస్టిక్ కణాలపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories