పెంపుడు కుక్కకు కరోనా..14 రోజుల పాటు..

X
Highlights
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఇప్పటి దాకా కరోనా వైరస్ కేవలం...
Arun Chilukuri5 March 2020 7:33 AM GMT
ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మరణ మృదంగాన్ని మోగిస్తోంది. ఇప్పటి దాకా కరోనా వైరస్ కేవలం మనుషుల్లోనే వ్యాప్తి చెందుతుందని తెలుసు. కానీ హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని అధికారులు బుధవారం వెల్లడించారు. హాంకాంగ్ లో కోవిడ్-19 రోగి అయిన 60 ఏళ్ళ మహిళ పెంపుడు కుక్కకు కూడా ఈ వైరస్ సోకిందట.
టెస్టులు జరపగా ఈ కుక్కకు 'వీక్ పాజిటివ్' లక్షణాలున్నట్టు తేలింది. దీంతో దాన్ని జంతువుల క్వారంటైన్ కు పంపించారు. గత శుక్రవారం నుంచి దానికి క్రమం తప్పకుండా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షల్లో దానికి బలహీన స్థాయిలో కరోనా వైరస్ ఉందని రిపోర్ట్ వస్తోంది. గత శుక్రవారం హాంకాంగ్ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్ ను ఏర్పాటు చేసింది. వైరస్ బారిన పడిన జంతువులను 14 రోజుల పాటు అక్కడ ఉంచి చికిత్స అందిస్తున్నారు.
Web Titlepet dog infected with covid-19 in hong kong
Next Story