బాగ్దాదీ ఆపరేషన్‌ వీడియో విడుదల.. అంతమొందించాక ఇల్లు పూర్తిగా నేలమట్టం

బాగ్దాదీ ఆపరేషన్‌ వీడియో విడుదల.. అంతమొందించాక ఇల్లు పూర్తిగా నేలమట్టం
x
Highlights

ఐసిస్‌ చీఫ్‌ కరడుగట్టిన ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీకి అంతమొందించిన ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ విడుదల చేసింది....

ఐసిస్‌ చీఫ్‌ కరడుగట్టిన ఉగ్రవాది అబు బకర్‌ అల్‌ బాగ్దాదీకి అంతమొందించిన ఆపరేషన్‌కి సంబంధించిన వీడియోను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్‌ విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా ప్రత్యేక బలగాలు బాగ్దాదీ ఉన్న ఇంటిని చుట్టుముడుతున్న సన్నివేశం స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే అమెరికా బలగాలు కిందకి దిగడానికి ముందే హెలికాప్టర్లపైకి కాల్పులు జరిపిన ముష్కరులపై దాడులు చేసిన ఘటనకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు. దాడికి ముందు బాగ్దాదీ ఇల్లు ఎలా ఉంది.. దాడి తర్వాత ఎలా మారిందో వీడియోలు రిలీజ్‌ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories