టమాటా బంగారం అయిపోయిందట.. ఈ పెళ్లికూతురు ఏంచేసిందో చూడండి!

టమాటా బంగారం అయిపోయిందట.. ఈ పెళ్లికూతురు ఏంచేసిందో చూడండి!
x
Image taken from video posted on Twitter by Naila Inayat
Highlights

బంగారం కొనగలిగే పరిస్థితి లేదు. ఇక అదే రకంగా టమాటాలూ కొనేలా లేదు. అందుకే ఈ పని చేసాను అంటోందీమె. పాకిస్తాన్ లో ఓ పెళ్లికూతురు టమాటాలతో చేసిన ఆభరణాలు...

బంగారం కొనగలిగే పరిస్థితి లేదు. ఇక అదే రకంగా టమాటాలూ కొనేలా లేదు. అందుకే ఈ పని చేసాను అంటోందీమె. పాకిస్తాన్ లో ఓ పెళ్లికూతురు టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. టమాటా ధర కూడా బంగారంలా సామాన్యులకు అందుబాటులో లేకుండా పోతోంది అందుకే టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించాను అని ఆమె ఒక పాకిస్తాన్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ కి చెందిన పాత్రికేయురాలు నైలా ఇనాయత్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.

పాకిస్థాన్ కు చెందిన ఓ పెళ్లికూతురు టమాటాలతో చేసిన ఆభరణాలు ధరించింది.. అన్నీ తెలుసు అనుకునే వారికీ ఇంకా తెలీనివి చాలా ఉంటాయని ఈ సంఘటన చెబుతుంది అంటూ కామెంట్ తో నైలా ఇనాయత్ తన ట్విట్టర్ లో ఈ పెళ్లికూతురు ఇంటర్వ్యూ వీడియొ ఉంచారు. దానిలో ఆ పెళ్లికూతురు టమాటా ఆభరణాల గురించి చాలానే చెప్పుకొచ్చింది. మూడు పెట్టెల టమాటాలతో ఈ ఆభరణాలు చేయించారు మా నాన్న అని చెప్పింది. అంతే కాదు టమాటాలు ఆభరణాలుగా ధరిస్తున్నానంటే నేను గొప్పదాన్నని అర్థం అంటూ కూడా చెప్పింది. మీ భర్త నుంచి మీరు ఏమి కోరుకుంటున్నారు అని అడిగిన ప్రశ్నకు ఈ ముద్దు గుమ్మా ఏం చెప్పిందో తెలుసా..కూరగాయల మార్కెట్ కి వెళ్లిన నా భర్త రోజూ టమాటాలు తీసుకు వస్తే చాలంటూ పంచ్ వేసింది.

ఈ వీడియో టమాటాలు ధరలపై సెటైర్ గా కనిపిస్తున్నా.. వాస్తవ పరిస్థితులకు అడ్డం పడుతోంది. టమాటాలు కూడా బంగారం మాదిరిగా అయిపోయాయని విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక ఈ వీడియో ను ఇప్పటి వరకూ 33 వేలమందికి పైగా చూశారు. మూడు వేలమందికి పైగా లైక్ చేశారు. మరి మీరూ ఈ వీడియో చూసి ఓ లైకెసుకోండి!

ప్రముఖ వార్తా ఏజెన్సీ పాకిస్తానీ మీడియాని ఉఉటంకిస్తూ తెలిపిన దాని ప్రకారం పాకిస్తాన్ కరాచీ లో రిటైల్ మార్కెట్ లో టమాటా కేజీకి 300 ఉందట. అదే హోల్ సేల్ మార్కెట్ లో 200 రూపాయలు పలుకుతోంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories