పాకిస్తాన్ లో 40మంది జమాత్ సభ్యులకు కరోనా వైరస్

పాకిస్తాన్ లో 40మంది జమాత్ సభ్యులకు కరోనా వైరస్
x
Highlights

పాకిస్తాన్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అధికారులు రాయివిండ్ (పాకిస్తాన్ లో జమాత్ యొక్క ప్రధాన కార్యాలయం) నగరాన్ని మొత్తం నిర్బంధంలో ఉంచారు.

పాకిస్తాన్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అధికారులు రాయివిండ్ (పాకిస్తాన్ లో జమాత్ యొక్క ప్రధాన కార్యాలయం) నగరాన్ని మొత్తం నిర్బంధంలో ఉంచారు.పాకిస్తాన్ లో కరోనా వైరస్ మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. దాంతో అధికారులు రాయివిండ్ (పాకిస్తాన్ లో జమాత్ యొక్క ప్రధాన కార్యాలయం) నగరాన్ని మొత్తం నిర్బంధంలో ఉంచారు.

అన్ని సాధారణ మరియు వైద్య దుకాణాలను సైతం మూసి వేశారు. నగరంలో 40 మంది తబ్లిఘి జమాత్ బోధకులకు కరోనా వైరస్ పరీక్షల్లో పాజిటివ్ అని తేలింది. దాంతో నగరం లోపల లేదా బయటా మొత్తం దిగ్భంధించారు. బయటివారెవరూ రాకుండా పూర్తిగా లాక్ డౌన్ చేశారు. అదేవిధంగా ఐదుగురు నైజీరియా మహిళలతో సహా జమాత్‌లోని 50 మంది సభ్యులను లాహోర్ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కసూర్‌లోని నిర్బంధ కేంద్రంలో చేర్చారు.

సింధ్ ప్రావిన్స్లోని హైదరాబాద్ నగరంలో, తబ్లిఘి జమాత్ సభ్యులలో 38 మందికి కరోనావైరస్ సోకింది. దాంతో సింధ్ మరియు పంజాబ్ పోలీసులు మసీదులు మరియు రాయివిండ్ మార్కాజ్ ప్రాంతంలో లాక్ డౌన్ విధించారు. అయితే కొంతమంది జమాత్ సభ్యులను లాక్డౌన్ ఉల్లంఘనకు పాల్పడటంతో వారిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు firstpost వెబ్సైటు పేర్కొంది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories