వక్రబుద్ధి బయటపెట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌.. ఎన్నికైన వెంటనే...

Pakistan Prime Minister Shehbaz Sharifs Sensational Comments on India | Live News
x

వక్రబుద్ధి బయటపెట్టుకున్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్‌.. ఎన్నికైన వెంటనే...

Highlights

Pakistan - Shehbaz Sharif: పఠాన్‌కోట్‌ దాడి తర్వాతే ఇండియా-పాక్ సంబంధాలు దిగజారాయి - షహబాజ్ షరీఫ్

Pakistan - Shehbaz Sharif: పాకిస్తాన్‌ ప్రధానిగా ఎన్నికైన వెంటనే షహబాజ్ షరీఫ్‌ తన వక్రబుద్ధి బయటపెట్టుకున్నారు. కశ్మీర్ అంశాన్ని, భారత్ 370 ఆర్టికల్‌ను రద్దు చేయడాన్ని తన తొలి ప్రసంగంలో ప్రస్తావించారు. కశ్మీర్‌ లోయలో ప్రజలు రక్తమోడుతున్నారని, కశ్మీర్‌ ప్రజలకు పాకిస్తాన్ దౌత్య, నైతిక మద్దతిస్తుందని చెప్పారు. అంతేకాదు.. కశ్మీర్‌ విషయాన్ని ప్రతి అంతర్జాతీయ సమావేశంలో ప్రస్తావిస్తామన్నారు.

2019లో అధికరణ 370 రద్దు సహా పలు సీరియస్ చర్యలను భారత్ చేపట్టిందని పాక్ ప్రధాని విషం కక్కారు. పఠాన్‌కోట్ దాడి తర్వాత ఇండో-పాక్ సంబంధాలు దిగజారినట్లు చెప్పారు షహబాజ్ షరీఫ్. అయితే ఐరాస తీర్మానాలకు, కశ్మీరాల ఆంక్షలకు అనుగుణంగా కశ్మీర్ సమస్యను పరిష్కరిద్దామని ప్రధాని మోడీని ఆహ్వానించారు. అయితే ఉగ్రవాదులకు పాక్ మద్దతు నిలిపివేస్తే చర్చలు జరుపుతామని భారత్ తేల్చిచెబుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories