Pakistan PM Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కీలక వ్యాఖ్యలు

Pakistan PM Shehbaz Sharif on Pahalgam Terror Attack
x

Pakistan PM Shehbaz Sharif: పహల్గామ్ ఉగ్రదాడిపై పాకిస్థాన్ ప్రధాని షరీఫ్ కీలక వ్యాఖ్యలు

Highlights

Pakistan PM on Pahalgam Terror Attack: పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోన్న ద రిసిస్టన్స్ ఫ్రంట్.

Pakistan PM Shehbaz Sharif on Pahalgam Terror Attack: పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కాశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై స్పందించారు. పహల్గామ్ టెర్రర్ ఎటాక్ ఘటనపై నిష్పాక్షిక విచారణకు తాము సిద్ధమేనని షరీఫ్ ప్రకటించారు. విచారణ నిష్పక్షపాతంగా జరిగితే, ఆ విచారణయలో పాల్గొనడానికి తాము రెడీగా ఉన్నామని అన్నారు. పహల్గామ్ దాడితో మరోసారి పాకిస్థాన్‌ను బద్నాం చేస్తున్నారని చెబుతూ బాధ్యత కలిగిన దేశంగా పారదర్శకంగా జరిగే విచారణ ఎదుర్కోవడానికి పాకిస్థాన్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఖైబర్ పంక్తువాలోని కకుల్ లో జరిగిన పాకిస్థాన్ మిలిటరీ అకాడమీలో గ్రాడ్యూయేషన్ సెరెమనీలో పాల్గొని మాట్లాడుతూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తోన్న ద రిసిస్టన్స్ ఫ్రంట్ ( TRF ) అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడికి బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారత్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నే లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు పాకిస్థాన్ ఆశ్రయం ఇవ్వడంతో పాటు అన్నివిధాలుగా సహాయ సహకారాలు అందిస్తోందనే ఆరోపణలు ఉన్నాయి.

ముంబై 26/11 నుండి మొన్నటి పహల్గామ్ ఉగ్ర దాడి వరకు ఇండియాలో ఇప్పటివరకు జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక లష్కరే తొయిబా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇంత జరుగుతున్నప్పటికీ పాకిస్థాన్ మాత్రం భారత్ లో జరిగే ఉగ్రదాడుల్లో తమ ప్రమేయం లేదని ఎప్పటిలానే ప్రకటనలు విడుదల చేస్తోంది.

పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనడానికి తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని భారత్ చెబుతోంది. ప్రపంచ దేశాల ముందు పాకిస్థాన్ ను దోషిగా నిలబెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోన్న భారత్ అంతకంటే ముందుగా పాకిస్థాన్ పట్ల తమ కఠిన వైఖరిని చాటుకుంటూ కఠిన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే భారత్‌లో ఉన్న పాకిస్థానీయులను అందరినీ దేశం విడిచిపోవాల్సిందిగా ఆదేశించింది. దీంతో పంజాబ్‌లోని వాఘా-అట్టారి బార్డర్ వద్ద దేశం దాటిపోతున్న పాకిస్థానీయులతో భారీగా రద్ధి కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories