Top
logo

మేడే, మేడే, మేడే.. కరాచీ విమాన ప్రమాదంలో వెలుగులోకి పైలట్ సంభాషణ

మేడే, మేడే, మేడే.. కరాచీ విమాన ప్రమాదంలో వెలుగులోకి పైలట్ సంభాషణ
X
Highlights

పాకిస్థాన్‌లోని కరాచీలో గురువారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది.

పాకిస్థాన్‌లోని కరాచీలో గురువారం ఘోర విమాన ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం లాహోర్ నుంచి కరాచీ వెళ్తుంది.. ఈ విమానం కరాచీ సమీపంలోని రాగానే నివాస ప్రాంతాల్లో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 107మంది మరణించారు.

ఈ విమాన ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నామంటూ పైలట్ ఏం మాట్లాడరనే ఓ కాక్‌పిట్ సంభాషణ వెలుగులోకి వచ్చింది. విమానం కూలిపోవడానికి ముందు పైలట్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) మధ్య జరిగిన సంభాషణ ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'లైవ్ఏటీసీ.నెట్'లో ప్రత్యక్షమైంది. ఆ సంభాషణ తాము ప్రమాదంలో ఉన్నామని చెప్పేందుకు పైలట్ 'మేడే, మేడే, మేడే' అనే సందేశాన్ని ఏటీసీకి పంపాడు.

తొలుత పైలట్ అప్రోచ్ అవుతున్నట్టు ఏటీసీకి తెలిపాడు. ఏటీసీ కూడా నుంచి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఫ్లైట్ లెఫ్ట్ వైపునకు తిరగాలా? అని పైలట్ మళ్లీ ప్రశ్నించాడు. దీనికి ఏటీసీ నుంచి అవును అని గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఆ తర్వాత విమానం రెండు ఇంజిన్లు దెబ్బతిన్నాయని, నేరుగా వెళ్తున్నామని పైలట్ మళ్లీ చెప్పాడు. దీంతో ఏటీసీ బెల్లీ ల్యాండింగ్‌ కన్ఫామ్ చేయాలని కోరింది.

ల్యాండింగ్‌కు రెండు రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పింది. అర్థం కావడం లేదని చెప్పిన ఫ్లైలెట్ మేడే, మేడే, మేడే' అంట ప్రమాదంలో ఉన్నామన్న సంకేతాన్ని పంపాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకే విమానం ఓ మొబైల్ టవర్‌ను ఢీకొట్టి జనావాసాల్లో కుప్పకూలింది. 2 రన్‌వేలు సిద్ధంగా ఉన్నాయని చెప్పినా గాల్లో చక్కర్లు కొట్టేందుకే మొగ్గు చూపాడని ఏటీసీ అధికార ప్రతినిధి అబ్దుల్లా హెచ్.ఖాన్ వెల్లడించారు. అయితే విమానం ప్రమాదం జరిగిన స్థలం మోడల్ కాలనీ ఎక్కువగా పేదల నివసించే ప్రాంతం కావడం, ఎక్కువగా జనసాంద్రత ఉండే ప్రాంతం కావడం ఘటనపై ఆందోళన మరింత ఎక్కువైంది.

Web TitlePakistan plane Crash Last audio from pilot and visuals before crash
Next Story