Pakistan Literacy Crisis: పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం: చదువు కంటే తిండికే ప్రాధాన్యం.. దక్షిణాసియాలోనే అట్టడుగున దాయాది దేశం!

Pakistan Literacy Crisis: పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్రమైన విద్యా సంక్షోభంలో కూరుకుపోయింది.

Arun Chilukuri
Published on: 3 Feb 2026 4:19 PM IST
Pakistan Literacy Crisis: పాకిస్థాన్‌లో విద్యా సంక్షోభం: చదువు కంటే తిండికే ప్రాధాన్యం.. దక్షిణాసియాలోనే అట్టడుగున దాయాది దేశం!
X

Pakistan Literacy Crisis: పొరుగు దేశం పాకిస్థాన్ తీవ్రమైన విద్యా సంక్షోభంలో కూరుకుపోయింది. దక్షిణాసియా దేశాల్లోకెల్లా అక్షరాస్యతలో పాకిస్థాన్ అత్యంత దారుణమైన స్థితిలో ఉందని తాజా నివేదికలు వెల్లడించాయి. దేశంలో 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారిలో కేవలం 63 శాతం మంది మాత్రమే చదవడం, రాయడం చేయగలరని 'ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ నెట్‌వర్క్ (FAFEN)' తన సమీక్షలో పేర్కొంది.

నివేదికలోని ముఖ్యాంశాలు:

మందగించిన వృద్ధి: గత ఆరేళ్లలో పాకిస్థాన్ అక్షరాస్యత కేవలం 3 శాతం మాత్రమే పెరిగింది. 2018-19లో 60 శాతంగా ఉన్న అక్షరాస్యత రేటు, 2024-25 నాటికి 63 శాతానికి మాత్రమే చేరుకుంది.

లింగ వివక్ష: అక్షరాస్యతలో స్త్రీ, పురుషుల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. పురుషుల్లో 73 శాతం మంది చదువుకోగా, మహిళల్లో ఈ సంఖ్య కేవలం 54 శాతానికే పరిమితమైంది.

ప్రాంతీయ అసమానతలు: బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో అక్షరాస్యత అత్యల్పంగా (49 శాతం) నమోదైంది.

ఆర్థిక భారం: పాకిస్థాన్ చరిత్రలోనే తొలిసారిగా విద్యపై ప్రభుత్వం (2.23 ట్రిలియన్లు) కంటే కుటుంబాలే (2.8 ట్రిలియన్లు) అధికంగా ఖర్చు చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

ఆకలితో అక్షరాస్యత పోరాటం

తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా పాకిస్థాన్ ప్రజలు విద్య కంటే ఆహారం, నివాసం, యుటిలిటీ బిల్లులకే ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తోంది. గ్యాలప్ పాకిస్థాన్ సర్వే ప్రకారం, దేశంలో ప్రతి నలుగురిలో ఒకరు ఆహార అభద్రతతో (Food Insecurity) అల్లాడుతున్నారు. చదువులకన్నా ఆకలి తీర్చుకోవడంపైనే దృష్టి పెట్టాల్సి రావడంతో అక్షరాస్యత రేటు మందగిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story