Top
logo

పాకిస్థాన్ లో లాక్ డౌన్ ఉన్నా లేనట్టే.. చేతులెత్తేసిన ప్రభుత్వం..

పాకిస్థాన్ లో లాక్ డౌన్ ఉన్నా లేనట్టే.. చేతులెత్తేసిన ప్రభుత్వం..
X
Highlights

ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంటే పాకిస్థాన్ లో మాత్రం ప్రభుత్వం దీన్ని లైట్ గా తీసుకున్నట్టుంది.

ప్రపంచం మొత్తం కరోనాతో వణికిపోతోంటే పాకిస్థాన్ లో మాత్రం ప్రభుత్వం దీన్ని లైట్ గా తీసుకున్నట్టుంది. ప్రతి రోజూ కేసులు వేళల్లో నమోదు అవుతున్నా.. లాక్ డౌన్ ను మాత్రం కొనసాగించడానికి ఇష్టపడటం లేదు. దాంతో ప్రజలు రోడ్లమీద పెద్ద సంఖ్యలో తిరుగుతున్నారు. నిన్న సాయంత్రం వరకూ పాకిస్థాన్ లో 27 వేలకు పైగా ప్రజలు కరోనా సంక్రమణ భారిన పడ్డారు.

దేశవ్యాప్తంగా 700 మంది మరణించారు. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే ప్రభుత్వం మాత్రం లాక్డౌన్ సడలింపులు ఇవ్వడం ప్రారంభించింది. శనివారం నుండి దేశంలోని చాలా ప్రాంతాల్లో దుకాణాలు , కర్మాగారాలు తిరిగి ప్రారంభించబడ్డాయి. అంతేకాదు మెట్రో ఏరియాల్లో అయితే షాపింగ్ మాల్స్, క్లబ్ లకు అనుమతిచ్చారు.

నిజానికి లాక్‌డౌన్ ప్రభావం పాక్ లో అంతకు ముందే లేదని చెప్పొచ్చు.. మసీదులలో సామూహిక ప్రార్థనలపై నిషేధం ఉన్నప్పటికీ భారీ సంఖ్యలో ముస్లింలు పార్ధనలు చేసుకోవడానికి మసీదులకు వస్తున్నారు. వీరిని కట్టడి చేయడం ఎవరి తరం కావడంలేదు. పైగా పొలిసు సిబ్బందిపైనే ఒకానొక దశలో దాడి చేయడంతో.. వారు కూడా చూసి చూడనట్టు ఊరుకుంటున్నారు. వైద్యుల సంఘం కూడా ప్రమాదం పొంచి ఉందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. లాక్ డౌన్ ను ఎత్తివెయ్యొద్దని చెబుతూనే ఉంది.. అయినా కూడా ప్రధాని ఇమ్రాన్ వీరి హెచ్చరికలను పట్టించుకోలేదు. వైరస్ తీవ్రత ఉన్న ప్రాంతాల్లోనే లాక్ డౌన్ కొనసాగిస్తున్నారు. అయినా కూడా అక్కడ లాక్ డౌన్ ఉన్నా లేనట్టే అనే పరిస్థితి నెలకొంది.


Web Titlepakistan government lifts lockdown amid rise in coronavirus cases
Next Story