Pakistan: పాక్ లో ముస్లింలకు మాత్రమే సరుకుల పంపిణి.. హిందువులు ఒట్టిచేత్తో ఇంటికి

Pakistan: పాక్ లో ముస్లింలకు మాత్రమే సరుకుల పంపిణి.. హిందువులు ఒట్టిచేత్తో ఇంటికి
x
Highlights

పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆదివారం వరకు ఇక్కడ 1560 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

పాకిస్తాన్‌లో కరోనా మహమ్మారి కారణంగా పరిస్థితి క్లిష్టంగా మారింది. ఆదివారం వరకు ఇక్కడ 1560 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.బాధిత ప్రాంతాలకు సహాయం చేయడానికి ఇమ్రాన్ ప్రభుత్వం తన వంతు కృషి చేస్తోంది, కాని కరాచీలో హిందువుల పట్ల వివక్ష చూపిస్తున్నారు ముస్లింలు. ఇటీవల, రేషన్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు ప్రజలకు పంపిణీ చేశారు, కాని హిందువులను ఖాళీ చేతులతో ఇంటికి పంపించారు, ఈ ఉపశమనం తమకు కాదని, ముస్లిం సమాజంలోని ప్రజలకు మాత్రమే అని వారు అంటున్నారు.

సింధ్ ప్రావిన్స్‌లో 5 లక్షలకు పైగా హిందువులు ఉన్నారు. సింధ్ ప్రావిన్స్‌లో, లాక్డౌన్ సమయంలో చిక్కుకున్న కూలీలు, కార్మికులకు రేషన్ పంపిణీ చేసే బాధ్యతను జిల్లా యంత్రాంగానికి, ఒక స్వచ్ఛంద సంస్థకు ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడ గుమిగూడిన సుమారు 3 వేల మందికి హెల్త్ స్క్రీనింగ్ కోసం ఏర్పాట్లు కూడా లేవు.

కరాచీ నగరం, సింధ్ ప్రావిన్స్‌లోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న హిందువులు తీవ్రమైన ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొన్నారని రాజకీయ కార్యకర్త డాక్టర్ అమ్జాద్ అయూబ్ మీర్జా అన్నారు. వారు భారత ప్రభుత్వం నుండి సహాయం కోరుతున్నారని.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సింధ్ ప్రావిన్స్‌లోని హిందువుల కోసం రేషన్ మరియు ఇతర ముఖ్యమైన ఆహార పదార్ధాలను రాజస్థాన్ ద్వారా పంపాలని ఆయన కోరుతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories