అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా వాడేసింది: పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్‌ ఖవాజా సంచలన వ్యాఖ్యలు!

Pakistan: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిప్పులు చెరిగారు.

Arun Chilukuri
Published on: 11 Feb 2026 12:00 PM IST
అమెరికా మమ్మల్ని టాయిలెట్ పేపర్‌లా వాడేసింది: పాక్ రక్షణ మంత్రి ఆసిఫ్‌ ఖవాజా సంచలన వ్యాఖ్యలు!
X

Pakistan: అగ్రరాజ్యం అమెరికాపై పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ నిప్పులు చెరిగారు. తమ దేశ అవసరాల కోసం పాకిస్థాన్‌ను వాడుకుని, ఆ తర్వాత 'టాయిలెట్ పేపర్' కంటే హీనంగా వదిలేసిందని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా తన రాజకీయ, వ్యూహాత్మక ప్రయోజనాల కోసమే తమతో చేతులు కలిపిందని ఆయన ఆరోపించారు.

అమెరికాతో స్నేహం.. మేము చేసిన పెద్ద తప్పు!

అఫ్గానిస్థాన్‌ పరిణామాల నేపథ్యంలో 1999 తర్వాత అమెరికాతో జతకట్టడం పాకిస్థాన్ చరిత్రలోనే అతిపెద్ద తప్పిదమని ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల దేశం ఆర్థికంగా, సామాజికంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుందని, దాని పర్యవసానాలను దేశం ఇప్పటికీ అనుభవిస్తూనే ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

మంత్రి చేసిన ప్రధాన ఆరోపణలు:

1999లో నవాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని కూల్చి అధికారం చేపట్టిన జనరల్ పర్వేజ్ ముషారఫ్, అమెరికా ఒత్తిడికి తలొగ్గి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారని విమర్శించారు.

2001 తర్వాత అమెరికా అండతో తాలిబన్లకు వ్యతిరేకంగా తాము జరిపిన పోరాటం కారణంగా, తిరిగి తాలిబన్లు పాక్‌పైనే హింసకు పాల్పడ్డారని గుర్తుచేశారు.

పాకిస్థాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలోనూ అగ్రరాజ్యం తమకు ఎలాంటి సహాయం చేయలేదని, కేవలం తమ అవసరాలకు మాత్రమే వాడుకుందని మండిపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story