కరోనా సాకుతో ఉగ్రవాదులను విడుదల చేసిన పాకిస్థాన్

కరోనా సాకుతో ఉగ్రవాదులను విడుదల చేసిన పాకిస్థాన్
x
Highlights

పాకిస్థాన్ లో కరోనావైరస్ సాకుతో ఉగ్రవాదులకు స్వేచ్ఛ లభించింది.

పాకిస్థాన్ లో కరోనావైరస్ సాకుతో ఉగ్రవాదులకు స్వేచ్ఛ లభించింది. కరోనాని అడ్డుపెట్టుకొని ఉగ్రవాది హఫీజ్ సయీద్ తో సహా అనేక మంది ఉగ్రవాదులను పాకిస్తాన్ ప్రభుత్వం విడుదల చేసింది, లాహోర్‌లోని ఓ జైళ్లో 50 మంది ఉగ్రవాదులకు కరోనా సోకినట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పాక్ కేంద్ర ప్రభుత్వానికి తెలపడంతో.. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా నెపంతో ప్రమాదకర ఉగ్రవాదులందరిని తాత్కాలికంగా విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.

ఇక పాకిస్థాన్ కు‌ బ్లాక్‌ లిస్ట్‌ ముప్పును పూర్తిగా తప్పించాలంటే ఉగ్రవాద కార్యకలాపాల్ని పూర్తిగా నిషేధించాలని కొద్దిరోజుల కిందట ఆర్థిక చర్యల కార్యదళం (ఎఫ్‌ఏటీఎఫ్‌) గట్టిగా హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎఫ్‌ఏటీఎఫ్‌ హెచ్చరికల్ని దృష్టిలో ఉంచుకొని.. గత కొన్ని నెలల్లో చాలా మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేసింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ను బ్లాక్‌ లిస్ట్‌ జాబితాలో చేర్చాలా..? వద్దా..? అనే అంశంపై వచ్చే నెలలో ఎఫ్‌ఏటీఎఫ్‌ మరోసారి సామీక్ష నిర్వహించే అవకాశం ఉంది. అయితే ఈలోపే ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న సుమారు 1000 మందిని అధికారిక జాబితా నుంచి పాక్‌ ప్రభుత్వం తొలగించింది.

ఇదిలావుంటే ప్రస్తుతం ప్రపంచం మహమ్మారిని ఎదుర్కోవడంలో భారత్ సహా వివిధ దేశాలు కేంద్రీకృతమై ఉన్నాయి, ఈ తరుణంలో జమ్మూకాశ్మీర్ లో పాక్ సైనికులు పలుమార్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories