పాకిస్థాన్‌లో దారుణం: సొంత ప్రజలపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం

పాకిస్థాన్‌లో దారుణం: సొంత ప్రజలపై యుద్ధ విమానాలతో బాంబుల వర్షం
x
Highlights

Pakistan: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై దాడి చేశాయి.

Pakistan: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లోని ఒక గ్రామంపై దాడి చేశాయి. తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తిర్హా లోయలోని మాత్రె దారా గ్రామంపై ఫైటర్ జెట్‌లు ఎల్‌ఎస్-6 రకానికి చెందిన 8 బాంబులను జారవిడిచాయి. ఈ దాడిలో కనీసం 30 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

ఈ వైమానిక దాడుల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గాయపడినట్లు స్థానిక మీడియా నివేదించింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు, వీడియోలలో మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి.

పాకిస్థాన్ గతంలో కూడా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో ఈ ప్రావిన్స్‌లో దాడులు నిర్వహించింది. ఈ దాడుల వల్ల పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పాకిస్థాన్ ఇనిస్టిట్యూట్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీస్ గణాంకాల ప్రకారం, ఈ ఏడాది జనవరిలో ఉగ్రదాడులు అంతకుముందు నెలతో పోలిస్తే 42% పెరిగాయి. బలోచిస్థాన్ తర్వాత అత్యధిక ఉగ్రదాడులు జరిగేది ఈ ప్రావిన్స్‌లోనే.

Show Full Article
Print Article
Next Story
More Stories