ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల విమానాలు నేలమీదే..

ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండొంతుల విమానాలు నేలమీదే..
x
Highlights

కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల (62%) విమానాలు ఎగరడం లేదు. ఈ విమానాలను విమానాశ్రయాల తోపాటు పలు ప్రాంతాలలో ఒక్కొక్కటిగా వరుసక్రమంలో ఉంచారు.

కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల (62%) విమానాలు ఎగరడం లేదు. ఈ విమానాలను విమానాశ్రయాల తోపాటు పలు ప్రాంతాలలో ఒక్కొక్కటిగా వరుసక్రమంలో ఉంచారు. ప్రస్తుతం 16,000 విమానాలు గ్రౌండ్ మీద ఉన్నాయి. దీంతో విమానాలకు పార్కింగ్ సమస్య ఎక్కువైంది. ఈ పరిస్థితిలో, విమానయాన సంస్థలు సరైన స్థలాన్ని కనుగొనటానికి కష్టపడుతున్నాయి. ఆస్ట్రేలియా, అమెరికా దేశాలు అయితే ఎడారి ప్రాంతాలను ఎంచుకున్నాయి.

అయితే కొన్ని సంస్థలకు సొంతంగా పార్కింగ్ స్థలాలు ఉండటంతో ఆ ఇబ్బంది లేదు. అయితే పార్కింగ్ స్థలం లేని సంస్థలు మాత్రం భారీగా డబ్బులు చెల్లించి విమానాలను నిలుపుకుంటున్నాయి. మరోవైపు విమానాలను నిలపడమే కాదు వాటి మెయిన్ టైనెన్స్ కూడా కష్టతరంగా మారింది. ఎక్కువ రోజులు ఖాళీగా ఉండటం వలన పక్షులు చేరి గూడు తయారు చేసుకునే అవకాశం ఉంది..

అలాగే భారీగా దుమ్ము ధూళి చేరుతుంది.. దీన్ని ఎప్పటికప్పుడు తొలగించకపోతే తుప్పుపట్టే అవకాశం ఉంది.. మరీ ముఖ్యంగా తేమ భాగాలలో ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి.. ఇక్కడే ఎక్కువగా తుప్పు పెరుగుతుంది. అంతేకాదు విమానాల టైర్లను కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.. విమానం చక్రాలు కనీసం రెండు వారాలకైనా తిప్పాలి.. అప్పుడప్పుడు ల్యాండింగ్ గేర్‌లో హైడ్రాలిక్ ద్రవాన్ని పోయాలి. బయటి రంధ్రాలన్నీ కప్పెయ్యాలి, లేదంటే కీటకాలు దానిలోకి ప్రవేశిస్తాయి. వీలైతే వాటర్ వాష్ చేసుకోవడం బెటరని చెబుతున్నారు. కాగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వ్యాపించడంతో విమానయాన ప్రయాణాలు దాదాపు నిలిచిపోయాయి. అయితే వైద్య సమాజని తరలించడానికి, అత్యవసర పరిస్థితులలో మాత్రమే కొన్ని విమానాలు పనిచేస్తున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories