Nobel Prize in Chemistry 2025: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌

Nobel Prize in Chemistry 2025: రసాయన శాస్త్రం (Nobel Prize in Chemistry) 2025 సంవత్సరానికి గాను విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది.

Arun Chilukuri
Published on: 8 Oct 2025 3:52 PM IST
Nobel Prize in Chemistry 2025: రసాయనశాస్త్రంలో ముగ్గురికి నోబెల్‌
X

Nobel Prize in Chemistry 2025: రసాయన శాస్త్రం (Nobel Prize in Chemistry) 2025 సంవత్సరానికి గాను విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు దక్కింది. మెటల్‌-ఆర్గానిక్‌ ఫ్రేమ్‌వర్క్స్‌ (MOFs) అనే కొత్తరకం మాలిక్యూలర్‌ ఆర్కిటెక్చర్‌ను అభివృద్ధి చేసినందుకుగాను సుసుము కిటాగవా, రిచర్డ్‌ రాబ్సన్‌, ఒమర్‌ ఎం యాఘీలకు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందించనున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ప్రకటించింది.

నోబెల్ చరిత్రలో ముఖ్య అంశాలు

గతేడాది (2024) ఈ అవార్డు ప్రొటీన్లపై పరిశోధనలు చేసిన డేవిడ్‌ బేకర్, డెమిస్‌ హసాబిస్, జాన్‌ జంపర్‌లకు దక్కింది.

1901 నుంచి 2024 మధ్యకాలంలో రసాయన శాస్త్రంలో ఇప్పటివరకు 116 సార్లు నోబెల్‌ను ప్రకటించగా, 195 మంది శాస్త్రవేత్తలు దీనిని అందుకున్నారు.

అతిపెద్ద వయస్కుడు: జాన్‌ బీ గూడ్‌ఎనఫ్‌, 97 ఏళ్ల వయసులో కెమిస్ట్రీలో పురస్కారం అందుకున్న అత్యంత వృద్ధుడిగా రికార్డు సృష్టించారు.

అతిపిన్న వయస్కుడు: ఫ్రెడెరిక్‌ జొలియట్‌, 35ఏళ్ల వయసులో నోబెల్‌ అందుకున్న అతిపిన్న వయస్కుడిగా నిలిచారు.

రెండుసార్లు విజేతలు: ఫ్రెడరిక్‌ సాంగెర్‌ మరియు బ్యారీ షార్ప్‌లెస్‌లు రసాయన శాస్త్రంలో రెండుసార్లు నోబెల్‌ అందుకోవడం ఒక విశేషం.

కొనసాగనున్న నోబెల్ ప్రకటనలు

అక్టోబర్‌ 6న వైద్యశాస్త్రంతో మొదలైన నోబెల్‌ పురస్కారాల ప్రకటన అక్టోబర్‌ 13 వరకు కొనసాగనుంది. మంగళవారం భౌతికశాస్త్రంలో విజేతలను ప్రకటించగా, బుధవారం రసాయన శాస్త్రం గ్రహీతల పేర్లు వెల్లడించారు.

గురువారం: సాహిత్యం

శుక్రవారం: శాంతి బహుమతి

అక్టోబర్‌ 13: అర్థశాస్త్రం

ఆల్‌ఫ్రెడ్‌ నోబెల్‌ వర్ధంతి రోజైన డిసెంబర్‌ 10న విజేతలకు అధికారికంగా అవార్డులను అందజేస్తారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story