logo
ప్రపంచం

పుట్టడంతోనే మాస్క్ తీస్తున్న శిశువు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో

పుట్టడంతోనే మాస్క్ తీస్తున్న శిశువు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటో
X
Highlights

మాస్క్ పెట్టుకు తిరుగుతామని, దూరంగా జరిగి మాట్లాడుతామని, హగ్ ఇచ్చుకోవాలన్నా హద్దులు పెట్టుకోవాల్సి వస్తుందని...

మాస్క్ పెట్టుకు తిరుగుతామని, దూరంగా జరిగి మాట్లాడుతామని, హగ్ ఇచ్చుకోవాలన్నా హద్దులు పెట్టుకోవాల్సి వస్తుందని ఎప్పుడైనా ఊహించామా మనం ! కానీ మాయదారి కరోనా ఇవన్నీ నిజం చేసింది. ఐతే ఇవన్నీ ఆలోచనల్లో మెదులుతుండగా దుబాయ్‌లో అప్పుడే పుట్టిన శిశువుకు సంబంధించిన ఫొటో తెగ ముచ్చట కలిగిస్తోంది. డాక్టర్ మాస్క్ తీసేందుకు ప్రయత్నిస్తున్న ఉన్న ఒక ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రపంచం అంతా కరోనా చిక్కుకున్న ఈ సమయంలో ఈ ఫొటో తెగ చక్కర్లు కొడుతోంది. తాను చూసిన అందమైన చిత్రం ఇది త్వరలోనే మనం మాస్కులు తీసే రోజులు వస్తాయని ఆశిద్దాం అంటూ ఆ డాక్టర్ పెట్టిన లైన్ ఆకట్టుకుంటోంది. ఇక ముందుందిలే మాస్కులు తీసే కాలం అని కొందరు ఫొటో ఆఫ్ ది 2020 అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు.

Web Titlenewborn baby Removing Doctor's Mask
Next Story