న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి ప్రమాణ స్వీకారం

న్యూజిలాండ్ ప్రధానిగా జెసిండా ఆర్డెర్న్ రెండోసారి ప్రమాణ స్వీకారం
x
Highlights

ఇటివల జరిగిన ఎన్నికల్లో గెలిచిన జెసిండా ఆర్డెర్న్ న్యూజిలాండ్ దేశానికి రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.. వెల్లింగ్టన్ అధికార గృహంలో జరిగిన కార్యక్రమంలో జెసిండా ఆర్డెర్న్ తో పాటుగా ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు.

ఇటివల జరిగిన ఎన్నికల్లో గెలిచిన జెసిండా ఆర్డెర్న్ న్యూజిలాండ్ దేశానికి రెండోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు.. వెల్లింగ్టన్ అధికార గృహంలో జరిగిన కార్యక్రమంలో జెసిండా ఆర్డెర్న్ తో పాటుగా ఇతర మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. విశిష్ట ప్రతిభ, అపారమైన అనుభవం కలిగిన నేతలతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాని, దేశం ఎలాంటి సంక్షోభంలోకి వెళ్ళినా నిబద్దతో ఎదురుకుంటామని జెసిండా ఆర్డెర్న్ చెప్పుకొచ్చారు.

ఇటివల జరిగిన ఎన్నికల్లో జెసిండా ఆర్డెర్న్‌ సారధ్యంలోని లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో 120 సీట్లకు గాను 64 సీట్లను సాధించింది. అయితే ఇప్పటివరకూ న్యూజిలాండ్ చరిత్రలో ఒక పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది లేదు.. ఇప్పటివరకు అన్ని సంకీర్ణ ప్రభుత్వాలే ఆ దేశాన్ని పాలిస్తూ వచ్చాయి. కోవిడ్ 19ని నియంత్రణకి గాను ఆమె చేసిన కృషినే ఈ విజయానికి కారణమని ఆ పార్టీ నేతలు వెల్లడించారు.

ఇక ఈ ఎన్నికల్లో లేబర్‌ పార్టీకి 49శాతం ఓట్లు రాగా.. నేషనల్‌ పార్టీకి 27శాతం ఓట్లు వచ్చినట్టుగా ఎన్నికల కమిషన్ వెల్లడించింది. ఇక 2017లో జసిండా ఆర్డెర్న్‌ తొలిసారి ప్రధానిగా ఎన్నికైయ్యారు.

Show Full Article
Print Article
Next Story
More Stories