న్యూజీలాండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆవులు, గేదెలు, గొర్రెలపై పన్ను..

New Zealand Announces Tax on Cow and Sheep Burps
x

న్యూజీలాండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆవులు, గేదెలు, గొర్రెలపై పన్ను..

Highlights

New Zealand: న్యూజీలాండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి ఆవులు, గేదెలు, గొర్రెలపై ట్యాక్స్‌ను విధించింది.

New Zealand: న్యూజీలాండ్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారి ఆవులు, గేదెలు, గొర్రెలపై ట్యాక్స్‌ను విధించింది. వినడానికి ఇది వింతగా ఉన్నా.. ఇది నిజం.. పెంపుడు జంతువులపై విధించిన పన్నును చెల్లించేందుకు అక్కడి రైతులు కూడా సంసిద్ధత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వాతావరణ మార్పులను అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ దేశ ప్రధానమంత్రి జస్టిన్‌ డార్డెన్‌ ప్రకటించారు. వాతావరణానికి తీవ్ర నష్టం కలిగించే గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో సగానికి పైగా పశువుల నుంచే వస్తున్నట్టు తెలిపారు. ప్రధానంగా మీథేన్‌ ఎక్కువగా విడుదలవుతున్నట్టు స్పష్టం చేశారు. ఆ మేరకు రెండ్రోజుల క్రితం పశువులపై పన్ను విధిస్తూ కొత్త ముసాయిదాను తీసుకొచ్చారు. అయితే కొత్త చట్టం ప్రకారం 2025 నుంచి పెంపుడు జంతువులపై పన్నును రైతులు చెల్లించాల్సి ఉంటుంది.

ప్రపంచంలోనే అత్యధికంగా పశువులను న్యూజీలాండ్‌లోనే పెంచుతున్నారు. ఆ దేశంలో ప్రజల కంటే ఏడు రెట్లు పెంపుడు జంతువులే ఉండడం విశేషం. ఆ దేశ జనాభా 50 లక్షలైతే కోటికి పైగా పశువులు, 2కోట్ల 60 లక్షల గొర్రెలు ఉన్నాయి. న్యూజీలాండ్‌లోని కాలుష్య కారకాల జాబితాలోకి గతంలో వ్యవసాయాన్ని చేర్చలేదు. అయితే పశుల నుంచి అధికంగా మీథేన్‌ విడులవుతున్నట్టు నిపుణులు గుర్తించారు. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ వార్మింగ్‌ను తగ్గించేందుకు తమవంతు కృషి చేద్దామని న్యూజీలాండ్‌ వాతావరణ శాఖ మంత్రి జేమ్స్‌ షా తెలిపారు. వాతావరణంలోకి విడుదలవుతున్న మీథేన్‌ను సాధ్యమైనంత వరకు నియంత్రిద్దామని పిలుపునిచ్చారు. వ్యవసాయ ఉద్గారాలను తగ్గించేందుకు పన్నును చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.

అయితే గ్రీన్‌హౌస్‌ వాయువులను అరికట్టడంలో భాగంగా రైతులకు ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం ప్రకటించింది. పొలాల్లో చెట్లను నాటడానికి నిధులను ఇస్తామని తెలిపింది. దీంతో రైతులకు, అటు పర్యావరణానికి కూడా మేలు జరుగుతుందని న్యూజీలాండ్‌ ప్రభుత్వం చెబుతోంది. ఇక రైతుల నుంచి వసూలు చేసిన పన్నులను వారి సంక్షేమానికి, వ్యవసాయ పరిశోధనలకు కేటాయించనున్నారు. ఇక వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు 190కోట్ల డాలర్లను న్యూజీలాండ్‌ ప్రభుత్వం కేటాయించింది. గ్రీన్‌హౌస్‌ వాయువుల్లో కార్బన్‌ డై ఆక్సైడ్‌ కంటే అత్యంత ప్రమాదకరమైనది మీథెన్. 2019లో వాతావరణంలో మీథేన్‌ రోజురోజుకు పెరుగుతోంది. అత్యధికంగా ఈ వాయువు వ్యవసాయం నుంచే వెలువడుతోందని ఇటీవల పరిశోధనలు తెలిపాయి.

కార్బన్‌ డై ఆక్సైడ్‌ కంటే మీథన్‌ 84 రెట్లు శక్తివంతమైనది. నూరేళ్ల కాలంలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ కంటే 30 రెట్లు అధికంగా వాతావరణంలో ఉష్ణోగ్రతను మీథేన్‌ పెంచుతోంది. పశువులు విడుదల చేసే వాయువులు, బియ్యం ఉత్పత్తి, వ్యవసాయ వ్యర్థాలతో మీథేన్‌ భారీగా పెరుగతోంది. వాతావరణ కలుషితంలో మీథేన్‌ ప్రభావంపై మే 6న ఐక్యరాజ్యసమితి పర్యావరణ విభాగం ఓ నివేదికను విడుదల చేసింది. వ్యవసాయానికి వాడే జంతువుల నుంచి భారీగా మీథేన్‌ వెలువుడున్నట్టు నివేదించింది. ఇక మనుషుల వల్ల 45 శాతం మీథేన్‌ వెలువడుతున్నట్టు వివరించింది. 2045 నాటికి గ్లోబల్‌ వార్మింగ్‌ను 0.3 డిగ్రీల సెల్సియస్‌ వరకు పెరగకుండా నిరోధించగలదని చెప్పింది. మీథేన్‌ ఉద్గారంతో 2021లో 2 లక్షలా 60 వేల మంది మృత్యువాత పడినట్టు తెలిపింది. 7 లక్షల 75వేల మంది ఆస్తమాకు గురైనట్టు ఐక్యరాజ్య సమితి స్పష్టం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories