NCP Standing Committee Meeting Postponed: స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా..

NCP Standing Committee Meeting Postponed:  స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా..
x
KP Sharma Oli (File Photo)
Highlights

NCP Standing Committee Meeting Postponed: నేపాల్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) స్టాండింగ్ కమిటీ సమావేశం మరో వారం పాటు వాయిదా

NCP Standing Committee Meeting Postponed: నేపాల్ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ (ఎన్‌సిపి) స్టాండింగ్ కమిటీ సమావేశం మరో వారం పాటు వాయిదా పడింది, వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటం, వరదలు రావడంతో స్టాండింగ్ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ సమావేశాన్ని వాయిదా వేయడానికి ఎన్‌సిపి చైర్మన్ పుష్ప కమల్ దహల్ ప్రచండ పొద్దుపోయేవరకూ వ్యతిరేకించారని, అయితే పార్టీ అగ్ర నాయకులు మాధవ్ నేపాల్, హలలానాథ్ ఖనాల్‌ లు ప్రస్తుత పరిస్థితులలో స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని వాయిదా వేయడమే మంచిదని అభిప్రాయపడ్డారు. దాంతో వాయిదా నిర్ణయం వెలువడింది. ఇక సమావేశం వాయిదా పడటంతో ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామాపై స్పష్టత రావడానికి మరికొంత సమయం పడుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ప్రధాని పదవినుంచి కెపి శర్మ ఒలిని తొలగించాలనే ఒత్తిడి కూడా పెరుగుతోంది.

ఇదిలావుంటే నేపాల్‌లో రాబోయే రోజుల్లో కమ్యూనిస్టు పాలనను కొనసాగించగలిగేలా పీఎం ఒలి పదవి నుంచి తప్పుకునేలా చైనా దౌత్యవేత్తపై దహాల్ ఒత్తిడి చేస్తున్నారు. పార్టీలో స్థిరత్వాన్ని తీసుకురావడానికి.. చైనాతో దీర్ఘకాలిక ఆరోగ్యకరమైన సంబంధాలను నిర్ధారించడానికి ఒలి పదవి నుంచి తప్పుకోవడం ఉత్తమమైన పని అని దహాల్ స్పష్టంగా చెప్పారు. పార్టీ విచ్ఛిన్నం కాకుండా చూసుకోవడమే బీజింగ్ యొక్క ప్రధాన లక్ష్యం అని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories