కరోనా కట్టడికి అన్ని దేశాలు పోరాటం చేస్తుంటే.. వీళ్ళు ఎం చేశారో చూడండి!

కరోనా కట్టడికి అన్ని దేశాలు పోరాటం చేస్తుంటే.. వీళ్ళు ఎం చేశారో చూడండి!
x
Belarus football fans during a league match
Highlights

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తుంది.

కరోనా వైరస్.. ఇప్పుడు ప్రపంచదేశాలను వణికిస్తుంది. ఈ వ్యాధి నుంచి ఎలా బయట పడాలో తెలియక చాలా దేశాలు తలలు పట్టుకుంటున్నాయి. కరోనా కట్టడికి వ్యక్తిగత నియంత్రణ, ముఖ్యమని చాలా దేశాలు లాక్ డౌన్ విధించాయి. అందులో భాగంగా బహిరంగ సమావేశాలు, స్కూల్స్, సినిమా హాళ్లు, షాపింగ్‌ మాల్స్‌ ఇలా అన్నింటిని ముసివేశాయి. సామజీక దూరం కచ్చితంగా పాటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోరాయి. అయినప్పటికీ కరోనా కేసులు మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. కానీ ఓ దేశం ఇందుకు విభిన్నంగా వ్యవహరిస్తుంది.

ఐరోపాలో ఇప్పటికీ జాతీయ ఫుట్‌బాల్ లీగ్ ఆడుతున్న ఏకైక దేశం బెలారస్.. ఆదివారం అక్కడ ఎఫ్‌సి డైనమో బ్రెస్ట్ మరియు ఇస్లోచ్ మిన్స్క్ మధ్య టాప్-ఫ్లైట్ ఫుట్ బాల్ లీగ్ మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్ కు దాదాపుగా వెయ్యి మంది ప్రేక్షకులు హాజరయ్యారు.. ఇందులో డిఫెండింగ్ ఛాంపియన్ బ్రెస్ట్ 3-1 తేడాతో గెలిచి నాలుగు మ్యాచ్‌ల తర్వాత మూడో స్థానంలో నిలిచింది. అయితే ఈ ఫుట్‌బాల్‌ మ్యాచ్ ని బహిరంగంగా స్టేడియంలో నిర్వహించడానికి ఆ దేశ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకాషెంకో అనుమతి ఇవ్వడం విశేషం.. అయితే కరోనా భయం గురించి లుకాషెంకో మాట్లాడుతూ ఆ భయాలను "సైకోసిస్" అని కొట్టిపారేశారు. అంతేకాకుండా ఆర్థిక వ్యవస్థను కొనసాగించడం చాలా ముఖ్యమని వెల్లడించారు.

ఆ దేశంలో కరోనావైరస్ కేసుల గురించి ఒక్కసారి మాట్లాడుకుంటే బెలారస్లో ఇప్పటివరకు 29 మరణాలతో 2919 కేసులు నమోదయ్యాయి. బెలారస్లో వైరస్ వ్యాప్తిని నియంత్రించడానికి మరింత కఠినమైన చర్యల అవసరమని WHO నొక్కిచేప్పింది. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోకుండా మ్యాచ్ కి వేయి మందికి పైగా హాజరుకావడం అందరిని ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories