మెక్సికోలో కుప్పకూలిన నేవీ విమానం

మెక్సికోలో నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా టెక్సాస్‌లోని గాల్వేస్టోన్‌ కాజ్‌వే వద్ద విమానం కుప్పకూలిందని మెక్సికో నౌకాదళం తెలిపింది.

Arun Chilukuri
Published on: 23 Dec 2025 2:36 PM IST
మెక్సికోలో కుప్పకూలిన నేవీ విమానం
X

మెక్సికోలో నేవీకి చెందిన విమానం ప్రమాదానికి గురైంది. ఏడాది వయసున్న చిన్నారిని వైద్యచికిత్స కోసం తరలిస్తుండగా టెక్సాస్‌లోని గాల్వేస్టోన్‌ కాజ్‌వే వద్ద విమానం కుప్పకూలిందని మెక్సికో నౌకాదళం తెలిపింది. ఈ విమానంలో చిన్నారితో పాటు నలుగురు నేవీ అధికారులు, మరో నలుగురు పౌరులు ఉన్నారని, వీరిలో ఎవరు మృతి చెందారనేది స్పష్టంగా తెలియదని మెక్సికన్‌ అధికారులు తెలిపారు.

సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, ఫెడరల్‌ ఏవియేషన్‌ అధికారులు, నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయని వెల్లడించారు. గాల్వేస్టోన్‌ కౌంటీ షరీఫ్‌ కార్యాలయం ప్రమాదంపై స్పందించి, సహాయక చర్యల కోసం డ్రోన్‌ యూనిట్‌తో సహా రెస్క్యూ సిబ్బంది ఆ స్థలానికి వెళ్లినట్లు తెలిపింది. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడించింది. అయితే, ప్రమాదానికి పొగమంచే కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story