China: చైనాలో గుట్టలుగా వైద్య వ్యర్థాలు

Medical Waste  in China | China News
x

China: చైనాలో గుట్టలుగా వైద్య వ్యర్థాలు

Highlights

China: చైనాలో సవాల్‌గా మారిన మెడికల్‌ వేస్టేజీ

China: ఒక్క కరోనా కేసు వచ్చిందంటే డ్రాగన్‌ కంట్రీ చేసే ఓవర్ యాక్షన్‌ అంతా ఇంతా కాదు, జీరో కోవిడ్‌ పాలసీ కింద కేసు గుర్తించిన నగరంలో లక్షలాది మందికి ఏకంగా.. రోజుకు మూడు సార్లు పరీక్షలను నిర్వహించింది. జిన్‌పింగ్‌ ప్రభుత్వం బలవంతంగా ప్రజలను క్వారంటైన్‌ కేంద్రాలకు పంపింది. ఇందంతా ఒక ఎత్తయితే ఇప్పుడు ఆ పరీక్షలకు వినియోగించిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు బీజింగ్‌, షాంఘై, షెన్‌జెన్‌, టియాన్‌జిన్‌ నగరాల్లోగుట్టలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. మాస్క్‌లు, కరోనా కిట్లు, ఇతర వ్యర్థాలను ఎలా రీసైక్లింగ్ చేయాలోనని బీజింగ్ అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

కరోనా వైరస్‌తో ప్రపంచ దేశాలు విలవిలలాడాయి. కోట్ల మంది వైరస్‌ బారినపడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. వైరస్‌ను కట్టడి చేసేందుకు భారీ లాక్‌డౌన్లు విధించాయి. ఆ తరువాత ప్రజలకు టీకాలను ఇచ్చి వైరస్‌ను అడ్డుకున్నాయి. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం ఇదే విధానాన్ని పాటించింది. ఇప్పుడు కరోనా అంటే ప్రజల్లోనూ భయం పోయింది. పాజిటివ్‌ అని తేలినా ఇదివరకటిలా భయాందోళనకు గురవడం లేదు. వెంటనే ఐసోలేషన్‌కు వెళ్లిపోయి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దాదాపు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ ఇలానే చేస్తున్నారు. కానీ ప్రపంచమంతా ఒకెత్తు చైనా మాత్రం మరో ఎత్తు. అక్కడ ఒక్క కేసు నమోదైతే.. వంద కేసులు నమోదైనట్టు. పాజిటివ్‌ అని.. ఏ నగరంలో గుర్తిస్తారో.. అక్కడ బీజింగ్‌ అధికారులు చేసే ఓవర్‌ యాక్షన్‌ మామూలుగా ఉండదు. వేలమంది అధికారులు అక్కడ వాలిపోతారు. కోవిడ‌ టెస్టు కోసం ప్రజలను ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు లాక్కొస్తారు. లక్షలాది మంది జనాభాకు భారీగా టెస్టులు చేస్తారు. అది చాలదనుకుంటే.. ఒకే రోజులో ఒక్కొక్కరికి రెండు లేదా మూడు సార్లు కూడా టెస్ట్‌ చేస్తారు.

చైనా జీరో కోవిడ్‌ పాలసీపై ప్రపంచ దేశాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయినా జిన్‌పింగ్‌ ప్రభుత్వం మాత్రం లెక్కచేయడం లేదు. భారీ టెస్లులు.. క్వారంటైన్ కేంద్రలకు తరలింపు.. అక్కడ నిత్యం కృత్యమే. వైరస్‌ను నియంత్రించడానికి లక్షల కోట్ల రూపాయలను వెచ్చిస్తోంది చైనా ప్రభుత్వం. ఇది ఇలా ఉంటే.. కోవిడ్‌ టెస్టుల తరువాత ఇప్పుడా మెడికల్‌ వేస్టేజీ సమస్యగా మారింది. కోవిడ్‌ సునామీ సృష్టించిన షాంఘై, బీజింగ్‌, జెలిన్‌, పెన్‌జెన‌, టియాన్‌జిన్‌ ప్రావిన్సుల్లో కోవిడ్ వేస్టేజీ గుట్టలు గుట్టలుగా పేరుకుపోయింది. ఇటీవల లాక్‌డౌన్‌ సమయంలో ఒక్క షాంఘై నగరంలోనే 68వేల 500 టన్నుల వైద్య వ్యర్థాలను గుర్తించారు. రోజువారీ సాధారణ చెత్త ఉత్పత్తి కంటే.. ఇది ఆరు రెట్లు ఎక్కువ. ఈ చెత్త సాధారణ ప్రజల ఇళ్ల నుంచి సేకరించింది కాదు.. కేవలం వైద్య వ్యర్థాలు మాత్రమే. మానవ చరిత్రలోనే ఇంత భారీ వేస్టేజీ మరెప్పుడూ చూసి ఉండరని న్యూయార్క్‌ యూనివర్సిటీకి చెందిన పర్యావరణంపై అధ్యయనం చేస్తున్న యిఫెయ్‌ లీ..

చైనా నిబంధనల ప్రకారం కోవిడ్‌ వ్యర్థాలను ముందుగా వేరు చేసి క్రిమిసంహారక మందులను పిచికారి చేస్తారు. ఆ తరువాత వాటిని దహనం చేస్తారు. అయితే పేరుకుపోయిన వైద్య వ్యర్థాలను గ్రామీణ ప్రాంతంలో ఏం చేయాలన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. కోటి జనాభా ఉన్న నగరాల్లో ప్రతి చోటా అందుబాటులో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని జిన్‌పింగ్‌ ప్రభుత్వం ఆదేశించింది. అందుకు నిధులు భారీగా వెచ్చించాల్సి వస్తోందని స్థానిక ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పేరుకుపోతున్న వైద్య వ్యర్థాలను ఏం చేయాలోనని తలలు పట్టుకుంటున్నాయి. టెస్టులకు ఎంత ఖర్చు చేస్తాయో.. అంతే ఖర్చును వ్యర్థాల తొలగించి వాటిని దహనం చేయడానికి కూడా వెచ్చించాల్సి వస్తోందని స్థానిక ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారీ టెస్టులతో కోట్లాది డాలర్లు వృథా అవుతున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం వైద్య వ్యర్థాలను నిర్వీర్యం చేయడానికి కనీసం వెయ్యి కోట్ల డాలర్లు అవసరమని నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరుస లాక్‌డౌన్లతో దారుణమైన స్థితిలో ఉన్న చైనా ఆర్థిక పరిస్థితికి వైద్య వ్యర్థాలు పెద్ద సవాల్‌ అని నిపుణులు చెబుతున్నారు. రోజు రోజుకు నిర్వహిస్తున్న టెస్టుతో వైద్య వ్యర్థాలు తొలగించలేని విధంగా అసాధారణ రీతిలో పెరిగిపోతున్నట్టు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2060 నాటికి కార్బన్‌ న్యూట్రల్‌గా మారాలనే లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడమే కాకుండా.. వాయు, జల కాలుష్యాన్ని కూడా అరికట్టేందుకు చైనా చర్యలు చేపట్టింది. కానీ కరోనా మహమ్మారి కారణంగా పెరిగిన వైద్య వ్యర్థాలను చూస్తుంటే ఈ లక్ష్యం చేరుకోవడం అసాధ్యమని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు నిత్యం నమోదువుతున్న కేసులతో చైనా భారీగా టెస్టులు చేస్తోంది. రోజు రోజుకు మరింత వైద్య వర్థ్యాలు పెరిగిపోతుండడం ఆందోళన కలిస్తోంది.

పుట్టినిల్లు చైనాను కరోనా కలవరం సృష్టిస్తోంది. నిత్యం వరుస లాక్‌డౌన్లతో ప్రజలు కుదేలవుతున్నారు. నిత్యం టెస్టులతో ప్రభుత్వానికి భారమవుతున్నా జిన్‌పింగ్‌ ప్రభుత్వం మాత్రం పట్టువీడడం లేదు. కోరోనా కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ పతనం దిశగా వెళ్తోంది. జిన్‌పింగ్‌పై విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories