Syria: సిరియాలో అమెరికా భారీ వైమానిక దాడులు..అల్-ఖైదా ఉగ్రవాది ముహమ్మద్ సలాహ్ అల్-జబీర్ హతం

Syria: సిరియాలో అమెరికా భారీ వైమానిక దాడులు..అల్-ఖైదా ఉగ్రవాది ముహమ్మద్ సలాహ్ అల్-జబీర్ హతం
x
Highlights

Syria: సిరియాపై అమెరికా పంజా విసిరింది. భారీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అల్-ఖైదా ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం...

Syria: సిరియాపై అమెరికా పంజా విసిరింది. భారీ వైమానిక దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో అల్-ఖైదా ఉగ్రవాది మహ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను అమెరికా సైన్యం హతమార్చింది. గురువారం వాయువ్య సిరియాలో జరిగిన వైమానిక దాడిలో అల్-ఖైదాతో అనుబంధిత ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ సభ్యుడు ముహమ్మద్ సలాహ్ అల్-జబీర్‌ను హతమార్చినట్లు అమెరికా సైన్యం తెలిపింది. ఈ ప్రాంతంలోని తీవ్రవాద గ్రూపులకు అంతరాయం కలిగించి, బలహీనపరిచే ప్రయత్నంలో భాగంగానే ఈ వైమానిక దాడి జరిగిందని అమెరికా సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో తెలిపింది. ముహమ్మద్ సలాహ్ అల్-జబీర్ కూడా హుర్రాస్ అల్-దిన్ గ్రూపుతో సంబంధాలు ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories