Philippines Fire Accident: ఫిలిప్పీన్స్‌లో మహా విషాదం: అగ్నికి ఆహుతైన వెయ్యి ఇళ్లు.. 5 వేల మంది నిరాశ్రయులు!

Philippines Fire Accident: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బొంగావోలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Arun Chilukuri
Published on: 5 Feb 2026 2:17 PM IST
Philippines Fire Accident: ఫిలిప్పీన్స్‌లో మహా విషాదం: అగ్నికి ఆహుతైన వెయ్యి ఇళ్లు.. 5 వేల మంది నిరాశ్రయులు!
X

Philippines Fire Accident: ఫిలిప్పీన్స్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. బొంగావోలో రాత్రి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సముద్రంపై నిర్మించుకున్న నివాసాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు వెయ్యికి పైగా ఇళ్లు కాలి బూడిదవగా.. ఐదు వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారు. ప్రాథమిక దర్యాప్తులో ఓ ఇంట్లో ఎగసిపడ్డ మంటలే ఈ భారీ అగ్ని ప్రమాదానికి కారణమని అధికారులు తెలిపారు.

తీవ్రంగా వీస్తున్న గాలులకు కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని అధికారులు భావిస్తున్నారు. ఎగసిపడుతున్న మంటలను చూసి ఇళ్లల్లోని జనం ఒడ్డుకు పరుగులు తీయగా.. మరికొందరు సముద్రంలో దూకి తమ ప్రాణాలకు రక్షించుకున్నారు. ఫైర్ సిబ్బంది నాలుగు గంటల పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. అయితే, అప్పటికే ఆ ఏరియా మొత్తం కాలిబూడిదైంది. బాధితులకు తాత్కాలిక టెంట్లు, ఆహార పదార్థాలు, నీటిని ఏర్పాటు చేసి, గాయపడ్డవారికి చికిత్స అందించామని తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story