Philippines Earthquake: సునామీ హెచ్చరికలు.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Philippines Earthquake: సునామీ హెచ్చరికలు.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం
x

Philippines Earthquake: సునామీ హెచ్చరికలు.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం

Highlights

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంబవించింది. మిండనోవా ద్వీపాన్ని భూకంపం కుదిపేసింది.

Philippines Earthquake: ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంబవించింది. మిండనోవా ద్వీపాన్ని భూకంపం కుదిపేసింది. భారత కాలమాన ప్రకారం ఉదయం 9.43 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. పసిఫిక్ తీరంలోని డావాయో ఓరియంట్‌లోని మానయ్‌ టౌన్‌కు సమీపంలో భూమి కంపించింది. పెద్దపెద్ద భవనాలు దెబ్బతిన్నాయి. ఇళ్లలోని వస్తువులు చెల్లాచెదురు అయ్యాయి. ప్రజలు బయటకు పరుగులు తీశారు. ప్రాణనష్టం., ఇతర నష్టం వివరాలపై ఎటువంటి నివేదికలు రాలేదు.

అంతర్భాగంలో పది కిలో మీటర్ల లోతులో భూమి కదలికలు సంభవించినట్టు ఫిలిప్పైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వోల్కనాలజీ అండ్‌ సీస్మొలజీ తెలిపింది. పిలిఫీన్స్, ఇండోనేషియా సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. కొన్ని ప్రాంతాల్లో సునామీ అలలు సాధారణ అలల స్థాయి కంటే మూడు మీటర్ల వరకు , ఇండోనేషియా, పలావు ప్రాంతాల్లో ఒక మీటరు ఎత్తు వరకు ప్రకపంనలు భూ ఉండవచ్చని సునామీ హెచ్చరిక కేంద్రం తెలిపింది. భూకంప కేంద్రం నుంచి 186 మైళ్ల దూరంలో ప్రమాదకరమైన అలలు సంభవించవచ్చని తెలిపింది.

Show Full Article
Print Article
Next Story
More Stories