Earthquake: జపాన్‌ తీరంలో మరోసారీ భారీ భూకంపం

Earthquake: జపాన్‌ తీరాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఈశాన్య జపాన్‌లోని కుజీ (Kuji) పట్టణ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది.

Arun Chilukuri
Published on: 12 Dec 2025 12:01 PM IST
Earthquake: జపాన్‌ తీరంలో మరోసారీ భారీ భూకంపం
X

Earthquake: జపాన్‌ తీరంలో మరోసారీ భారీ భూకంపం

Earthquake: జపాన్‌ తీరాన్ని మరోసారి భారీ భూకంపం కుదిపేసింది. ఈశాన్య జపాన్‌లోని కుజీ (Kuji) పట్టణ ప్రాంతంలో భూమి తీవ్రంగా కంపించింది. జపాన్‌ మెటలర్జీకల్‌ ఏజెన్సీ (JMA) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 6.8 తీవ్రతతో నమోదైంది. ఈ తాజా భూకంపం కారణంగా తీర ప్రాంతాలకు సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు తక్షణమే హెచ్చరికలు జారీ చేశారు.

కుజీ పట్టణానికి 130 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో భూకంపం కేంద్రీకృతమైంది. సునామీ వచ్చే అవకాశం ఉందని జపాన్‌ మెటలర్జీకల్‌ ఏజెన్సీ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం, నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తీర ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు సూచించారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story