మసూద్ అజార్ తప్పించుకోలేదు.. బహవాల్పూర్ లో దాచారు : ఇంటెల్ ఇన్‌పుట్స్

మసూద్ అజార్ తప్పించుకోలేదు.. బహవాల్పూర్ లో దాచారు : ఇంటెల్ ఇన్‌పుట్స్
x
Highlights

టెర్రరిస్ట్ వాచ్‌డాగ్ ఎఫ్‌ఎటిఎఫ్‌తో కీలక సమావేశానికి ముందు సోమవారం జైషే ఇ మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ తప్పిపోయినట్లు పాకిస్తాన్ పేర్కొన్న సంగతి...

టెర్రరిస్ట్ వాచ్‌డాగ్ ఎఫ్‌ఎటిఎఫ్‌తో కీలక సమావేశానికి ముందు సోమవారం జైషే ఇ మొహమ్మద్ ఉగ్రవాది మసూద్ అజార్ తప్పిపోయినట్లు పాకిస్తాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే, మసూద్ అజార్‌ను పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్‌ఐ సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లినట్లు ఇంటెల్ ఇన్‌పుట్స్ వెల్లడించింది. వర్గాల సమాచారం ప్రకారం, మసూద్ అజార్ మరియు అతని కుటుంబం తప్పిపోలేదు కాని పారిస్‌లో జరిగిన ఎఫ్‌ఎటిఎఫ్ సమావేశానికి ముందు సురక్షితమైన ఇంట్లో ఉంచారు.. మసూద్ అజార్ మరియు అతని కుటుంబాన్ని బహవాల్పూర్ లోని ఇంటికి తీసుకువెళ్లారు.. అక్కడ కొత్త జైష్-ఎ-మొహమ్మద్ ప్రధాన కార్యాలయం అయిన మార్కాజ్ ఉస్మాన్-ఓ-అలీ వద్ద మసూద్ అజార్‌ను ఉంచినట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

మసూద్ అజార్‌ను బహవాల్పూర్ - కరాచీ రహదారిలోని జైష్ ప్రధాన కార్యాలయంలో భారీ భద్రతా సమక్షంలో పాకిస్థానే ఉంచినట్లు స్పష్టం చేస్తున్నాయి. మసూద్ అజార్ బహవాల్పూర్ మరియు ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని తన ఇళ్లకు తరచూ వెళుతుంటారని ఆ వర్గాలు తెలిపాయి. అయితే మసూద్ అజార్ దేశం నుంచి తప్పిపోయినట్లు పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల మంత్రి హమ్మద్ అజార్ సోమవారం తెలిపిన సంగతి తెలిసిందే. మూలాల ప్రకారం, మసూద్ అజార్ తప్పిపోయినట్లు మొదటి దర్యాప్తు నివేదిక (ఎఫ్ఐఆర్) ను దాఖలు చేయలేదని హమ్మద్ అజార్ పేర్కొన్నాడు.

మనీలాండరింగ్ మరియు టెర్రర్ ఫైనాన్సింగ్‌ను అరికట్టడంపై పాకిస్తాన్ ఎఫ్‌ఎటిఎఫ్ సిఫారసు చేసిన మార్గదర్శకాలను పాటించిందో లేదో నిర్ణయించే కీలకమైన ఎఫ్‌ఎటిఎఫ్ సమావేశానికి ముందే పాకిస్తాన్ వాదన వచ్చిందనే అనుమానం చాలా మందికి ఉంది. ఇటీవల, పాకిస్తాన్ కోర్టు లష్కర్-ఎ-తైబా చీఫ్ హఫీజ్ సయీద్‌కు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించిన సంగతి తెలిలిసిందే. అతన్ని కాపాడేందుకు పాకిస్థాన్ నంగనాచి నాటకాలు ఆడుతోందన్న విషయం భారత్ కు ఎప్పుడో తెలిసింది.. దాంతో ఉగ్ర కదలికలపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటూనే జమ్మూ కాశ్మీర్ తదితర ప్రాంతాల్లో కొందరు అనుమానిత ఉగ్రవాదులను ఏరివేస్తోంది. ఇటీవల కొందరు జైషే మహమ్మద్ సానుభూతిపరులను భారత ఆర్మీ ఏరివేసిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories