Mahatma Gandhi's glasses Auction: మహాత్ముడి కళ్లజోడు వేలం.. రిక్డారు ధ‌ర‌కు అమ్ముడు

Mahatma Gandhis glasses Auction: మహాత్ముడి కళ్లజోడు వేలం..   రిక్డారు ధ‌ర‌కు అమ్ముడు
x

Mahatma Gandhi’s glasses

Highlights

Mahatma Gandhi’s glasses Auction: మహాత్మాగాంధీకి మ‌న దేశంలోనే కాదు.. అంత‌ర్జాతీయంగా ఎంతో ఆద‌ర‌ణ ఉంది. వారికి ఆయ‌న పై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. మహాత్మాగాంధీ వాడిని ఏ వస్తువును వేలం వేసిన అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతోంది

Mahatma Gandhi's glasses Auction: మహాత్మాగాంధీకి మ‌న దేశంలోనే కాదు.. అంత‌ర్జాతీయంగా ఎంతో ఆద‌ర‌ణ ఉంది. వారికి ఆయ‌న పై ఉన్న అభిమానం అంతా ఇంతా కాదు. మహాత్మాగాంధీ వాడిని ఏ వస్తువును వేలం వేసిన అంతర్జాతీయంగా మంచి ధర పలుకుతోంది. గతంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో జాతిపిత మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా ఒకటి 2013లో వేలంపాటలో రూ. కోటి ధర పలికింది. లండన్‌లో నిర్వహించిన ఈ వేలంపాట అప్పట్లో సంచలనంగా మారింది.

తాజాగా.. మహాత్మాగాంధీ కళ్లజోడును ఇంగ్లండ్‌లోని ఈస్ట్ బ్రిస్టోల్ ఆక్షన్స్ సంస్థ వేలం వేసింది... ఈ వేలంలో కూడా అద్భుతమైన ధర పలికాయి. సౌతాఫ్రికాలో ఉన్న సమయంలో మహాత్మా గాంధీ ధరించిన గోల్డ్ ప్లేటెడ్ జత కళ్ల అద్దాలను బ్రిస్టల్‌లో వేలానికి పెట్టగడా.. ఇవి 260,000 యూరోలకు అమ్ముడుపోవడం విశేషం. అంటే భారత కరెన్సీలు సుమారు రూ. 2.5 కోట్లు.. ఈ అద్దాలను అమెరికాకు చెందిన ఒక పేరు తెలియని వ్యక్తి దక్కించుకున్నాడు. వేలంలో కనీసం 15వేల యూరోలు పలుకుతుందని నిర్వాహకులు భావించారట. కాగా, భారత్ సహా చాలా దేశాల నుంచి ప్రజలు ఈ అద్దాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపడంతో.. ధర ఒక్కసారిగా పెరిగింది.

గతంలో సౌతాఫ్రికాలో పనిచేసిన ఓ వ్యక్తి మ‌హాత్ముడి క‌ళ్ల‌జోడును సేకరించాడు. వంశపారంపర్యంగా తనకు వచ్చిన ఈ కళ్లజోడును ఇంగ్లండ్‌కు చెందిన వ్యక్తి బ్రిస్టోల్ ఆక్షన్స్‌కు పంపించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories