Mahatma Gandhi Statue: లండన్‌లో మహాత్మాగాధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

Arun Chilukuri
Published on: 30 Sept 2025 9:34 AM IST
Mahatma Gandhi Statue: లండన్‌లో మహాత్మాగాధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం
X

Mahatma Gandhi Statue: బ్రిటన్‌ రాజధాని లండన్‌లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. లండన్‌లోని టావిస్టాక్‌ స్వ్కేర్‌లో ఉన్న గాంధీ విగ్రహంపై గుర్తుతెలియని వ్యక్తులు విద్వేషపూరిత వ్యాఖ్యలు రాశారు. గాంధీ, మోడీ హందుస్థాని టెర్రరిస్టులని విగ్రహంపై రాశారు. ఈ ఘటనను అక్కడి భారత రాయబార కార్యాలయం తీవ్రంగా ఖండించింది. దీనిని అహింస వారసత్వంపై జరిగిన దాడిగా అభివర్ణించింది. మహాత్ముని విగ్రహాన్ని పూర్వ రూపంలోకి తీసుకొచ్చేందుకు అధికారులు కృషి చేస్తున్నారని తెలిపింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story