ఆ పుస్తకంలో 12 ఏళ్ల క్రితమే కరోనా ప్రస్తావన

ఆ పుస్తకంలో 12 ఏళ్ల క్రితమే కరోనా ప్రస్తావన
x
End Of Days Book
Highlights

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందిపైగా ప్రాణాలు విడిచారు.

కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కబళిస్తోంది. ఈ మహమ్మారి ధాటికి ప్రపంచ వ్యాప్తంగా 5వేల మందిపైగా ప్రాణాలు విడిచారు. అయితే ఈ కోవిడ్ మహమ్మారి గురించి 12 సంవత్సరాల క్రితమే ఓ పుస్తకంలో లిఖించి ఉంది. ఈ విషయాన్ని ఓ హాలీవుడ్ నటి, మోడల్ సోషల్‌ మీడియాలో షేర్ చేసింది. కరోనా వైరస్ ప్రస్తావన 'ఎండ్‌ ఆఫ్‌ డేస్‌' అనే పుస్తకంలో రాసివుందని హాలీవుడ్‌ నటి కిమ్‌ కర్ధాషియాన్‌ ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకుంది. 'ఎండ్‌ ఆఫ్‌ డేస్‌' అనే పుస్తకం గురించి తన సోదరి చెప్పినట్లు తెలిపింది.

2008లో 'ఎండ్‌ ఆఫ్‌ డేస్‌' అనే పుస్తకాన్ని ప్రముఖ రచయిత సిల్వియా బ్రౌన్‌ రచించింది. ఈ పుస్తకంలోని ఒక పేజీలో కరోనా లాంటి వ్యాధి స్పష్టంగా చెప్పాలంటే నిమోనియా వ్యాధి గురించి రచయిత సిల్వియా బ్రౌన్‌ ప్రస్తావించింది. ఈ బుక్‌లో 2020 సంవత్సరంలో తీవ్రమైన నిమోనియా ప్రపంచాన్ని వణికిస్తుందని ఆమె పేర్కొన్నారు. 'సుమారు 2020 సంవత్సరంలో నిమోనియా లాంటి వ్యాధి వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఎంతో అనారోగ్యానికి గురి అవుతారు. ఊపిరితిత్తులు, శ్వాసనాళలపై జబ్బు దాడి తీవ్రంగా ఉంటుందని తెలిపింది. అయితే ఇది ఎంత వేగంగా వచ్చిందో అలానే నశిస్తుంది. కానీ పది సంవత్సరాల తర్వాత ఇదే వ్యాధి మళ్లీ ప్రపంచవ్యాప్తంగా దాడి చేస్తుందిని సిల్వియా బ్రౌన్‌ 'ఎండ్‌ ఆఫ్‌ డేస్‌' బుక్ లో పేర్కొన్నారు. ఈ పుస్తకంలో కరోనా లాంటి వ్యాధిపై ప్రస్తవించడంతో దానిని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ షేర్లు చేస్తున్నారు.

కరోనా వైరస్ దేశంలో వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే దీని ప్రభావం వలన ఇద్దరు మరణించారు. మరో 84 మందికి కరోనా సోకినట్లు గుర్తించారు. కరోనా ప్రపంచ దేశాల అర్థిక వ్యవస్థలపైనే కాకుండా అన్ని రంగాలపై దీని ప్రభావం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు నమోదైయ్యాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ నెల 31వరకు సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్, పాఠశాలలు అన్ని తాత్కాలింగా ముసివేయాలని నిర్ణయం తీసుకున్నాయి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories