Top
logo

కశ్మీర్ భారత్ దే.. తాలిబన్ల ప్రకటన!

కశ్మీర్ భారత్ దే.. తాలిబన్ల ప్రకటన!
X
Highlights

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది....

కశ్మీర్ ఎప్పటికీ భారత్‌దేనని, ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోబోమని తాలిబన్ స్పష్టం చేసింది. కశ్మీర్‌లో పాక్‌ చర్యలపై స్పందిస్తూ.. జిహాదీ పేరిట ఆ దేశం ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదానికి తాము మద్దతు ఇస్తామని వస్తున్న ప్రచారాన్ని కొట్టి పారేస్తూ తాలిబన్ నేత సుహైల్ షాహీన్ ఓ ప్రకటన చేశారు.

అలాగే, కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్‌కు, తాలిబన్‌కు మధ్య సత్సంబంధాలు కొనసాగే ప్రసక్తే లేదని తాము చెప్పినట్లు వస్తోన్న ప్రచారాన్ని కూడా ఆయన కొట్టిపారేశారు. ఈ ప్రచారంలో నిజం లేదని, తాము అలాంటి ప్రకటన విడుదల చేయలేదని చెప్పారు. పొరుగు దేశాల అంతర్గత అంశాల్లో తలదూర్చొద్దన్నదే తమ విధానమని తేల్చి చెప్పారు.

Web TitleKashmir is India’s internal matter, says Taliban
Next Story