Joe Biden: ఐసీస్‌ టాప్‌ లీడర్‌ అబు ఇబ్రహీం అల్‌- ఖురేషి హతం

Joe Biden Says IS Leader killed During US Raid in Syria | Telugu Latest News
x

 ఐసీస్‌ టాప్‌ లీడర్‌ అబు ఇబ్రహీం అల్‌- ఖురేషి హతం

Highlights

Joe Biden: ఖురేషిని హతమార్చిన అమెరికా బలగాలు.. ట్విట్టర్‌లో వెల్లడించిన జో బైడెన్

Joe Biden: ఇస్లామిక్ స్టేట్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తమ ఉగ్రవాద వ్యతిరేక దళం సిరియాలోని అట్మీలో జరిపిన దాడిలో ఐఎస్ చీఫ్ అబూ ఇబ్రహీం అల్-హష్మి అల్- ‌ఖురేషి హతమయ్యాడని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తెలిపారు. ఈ ఆపరేషన్‌లో ఏ అమెరికా సైనికుడు కానీ, సైనిక సిబ్బంది కానీ గాయపడలేదు. ఆపరేషన్ తర్వాత సిబ్బంది సురక్షితంగా తిరిగివచ్చారని తెలిపారు.

అమెరికా సేనల దాడులు చేస్తున్నపుడు ఆ దాడుల్లో మరణించకుండా ఖురేషీ బాంబుతో పేల్చుకున్నాడని, ఈ పేలుడులో అతని కుటుంబ సభ్యులు కూడా చనిపోయారని వైట్‌హౌస్‌ సీనియర్‌ అధికారి వెల్లడించారు. అయితే అమెరికా సేనల దాడుల్లో ఖురేషీతో పాటు మరో 12 మంది చనిపోయారని, మృతుల్లో నలుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారని సిరియా మానవ హక్కుల సంస్థ తెలిపింది. కాగా, ఐఎస్‌ వ్యవస్థాపకుడు అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ 2019లో హతమైన తర్వాత అతని వారసుడిగా ఖురేషీని ఐఎస్‌ నియమించింది. అతడి సమాచారం తెలిపితే 74 కోట్ల బహుమతి ఇస్తామని అమెరికా గతంలో ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories