కోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం

Japanese Man Spends Rs 12 lakh to Look Like a Dog
x

కోలి జాతి శునకంలా మారిన జపాన్ వ్యక్తి.. అందుకు రూ.12 లక్షల వ్యయం

Highlights

*వినోద, వాణిజ్య, సినిమా ప్రకటనలకు... శిల్పాలు, ప్రత్యేక దుస్తులను తయారుచేస్తున్న జెప్పేట్‌

Japanese Man: కోలి ఈ జాతి శునకం ఎంతో అందంగా ఉంటుంది. చూడగానే చాలా మంది ఈ శునకరాజాన్ని ఇష్టపడుతారు. ఇప్పుడు మీరు చూస్తున్న శునం కూడా కోలి జాతికి చెందినదే అయితే ఇది నిజమైన శునకం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే అది శునకం కాదు టోకో ఈవీ అనే జపాన్ వ్యక్తి. అవాక్కవుతున్నారా?? అవును ఇది నిజం జంతువులా మారాలన్న తన కలను నెరవేర్చుకోవడానికి శునకంలా మారాడు. అందుకు అతడు అక్షరాల 12 లక్షల రూపాయలను వెచ్చించాడు. ఇప్పుడు అతడిని చూసి నెటిజన్లు సంబ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. ఇలా పూర్తి శునకంలా కనిపించేందుకు టోకో ఈవీ భారీగా ఖర్చు చేయగా నిపుణులు 40 రోజుల పాటు కష్టపడ్డారు.

జపాన్‌కు చెందిన జెప్పెట్‌ అనే సంస్థకు సినిమాలు, వాణిజ్య ప్రకటనలు, వినోద సౌకర్యాల కోసం వినూత్నమైన శిల్పాలను, మస్కట్‌ పాత్రల దుస్తులను తయారుచేయడంలో మంచి పేరుంది. జంతువులా మారాలన్న తన కోరికను జెప్పెట్‌ సంస్థకు టోకో ఈవీ తెలిపాడు. ఎంత ఖర్చైనా భరిస్తానని చెప్పడంతో అందుకు ఆ సంస్థ అంగీకరించింది. 40 రోజుల పాటు శ్రమించి ఈవీని కోలీ జాతి శునకంలా మార్చారు. ఇప్పుడు టోకో ఈవీ అచ్చం శునకంలాగే కనిపిస్తున్నారు. ఇప్పుడు ఈవీని చూస్తే శునకమనే అనుకుంటారు. ఈవీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తున్నాయి. సోషల్‌ మీడియాలో ఈవీని చూసి నెటిజన్లు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories