సౌదీలో రహస్యంగా పర్యటించిన ఇజ్రాయెల్ ప్రధాని

X
Highlights
Israel President Secret Trip to Saudi Arabia: సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా పర్యటించారు.
Arun Chilukuri23 Nov 2020 3:45 PM GMT
సౌదీ అరేబియాలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రహస్యంగా పర్యటించారు. సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్, అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియోలతో ఆయన భేటీ అయ్యారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ కు చెందిన ఆర్మీ రేడియో, కాన్ పబ్లిక్ రేడియో ఈరోజు వెల్లడించాయి. అయితే, ఈ పర్యటనకు సంబంధించి నెతన్యాహు అధికారిక కార్యాలయం కానీ, ఇజ్రాయెల్ లోని అమెరికా రాయబార కార్యాలయం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు నెతన్యాహు రహస్య పర్యటన ఇప్పుడు ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. మూడు దేశాలకు చెందిన నేతలు ఎందుకు కలుసుకున్నారు? ఏయే అంశాలపై చర్చించారు? అనే విషయంపై చర్చిస్తున్నారు.
Web TitleIsrael President Secret Trip to Saudi Arabia
Next Story