కాబూల్‎లోని గురుద్వారాను పేల్చివేసిన టెర్రరిస్టులు

ISIS Terrorists Attack on Gurdwara in Kabul
x

కాబూల్‎లోని గురుద్వారాను పేల్చివేసిన టెర్రరిస్టులు

Highlights

ISIS Terrorists: ఆఫ్ఘనిస్తాన్లోని ఓ గురుద్వారాను ఐసిస్ ఉగ్రవాదులు పేల్చివేశారు.

ISIS Terrorists: ఆఫ్ఘనిస్తాన్లోని ఓ గురుద్వారాను ఐసిస్ ఉగ్రవాదులు పేల్చివేశారు. కాబూల్‎లో గల కర్తే పర్వన్ గురుద్వారాను ISIS ఉగ్రవాదులు టార్గెట్ చేసి బాంబులు ప్రయోగించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు చనిపోయాడు. బాంబులు ప్రయోగించిన సమయంలో మరికొందరు అందులో చిక్కుకుని ఉండడంతో వారి గురించి ఆందోళన నెలకొంది. గాయపడ్డ కొందరిని ఆస్పత్రికి తరలించారు. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నాయకురాలు చేసిన కామెంట్లకు నిరసనగా తాము ఈ దాడికి పాల్పడ్డామని ISIS ఉగ్రవాదులు ప్రకటించారు. కాబూల్లోని గురుద్వారా పరిసరాల్లో హిందూ మైనారిటీలు, సిక్కు మైనారిటీలు ఉంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories