కరోనా దెబ్బకు కలుగులో దూరిన ఐసిస్.. ఉగ్రవాదులకు ఐసిస్ కీలక సూచనలు

కరోనా దెబ్బకు కలుగులో దూరిన ఐసిస్.. ఉగ్రవాదులకు ఐసిస్ కీలక సూచనలు
x
file photo
Highlights

ప్రపంచాన్ని గడగడలాడించే ఉగ్రవాద సంస్థ అది పచ్చినెత్తురు తాగే పరమ కిరాతక మూక నీతి, న్యాయం, వావి వరస ఏవీ లేని కర్కోటక ముఠా అదే ఐసిస్ సంస్థ ఆ పేరు చెబితే...

ప్రపంచాన్ని గడగడలాడించే ఉగ్రవాద సంస్థ అది పచ్చినెత్తురు తాగే పరమ కిరాతక మూక నీతి, న్యాయం, వావి వరస ఏవీ లేని కర్కోటక ముఠా అదే ఐసిస్ సంస్థ ఆ పేరు చెబితే ప్రపంచ దేశాలు భయపడిపోతాయ్ దాని రక్త దాహానికి ప్రతీ దేశమూ ఎంతో కొంత బలయినదే అలాంటి కిరాతక మూక ఇప్పుడు కలుగులో దూరిన చందంగా తోక ముడిచేసింది ఎందుకు? ఏమైంది? జస్ట్ వాచ్ దిస్ స్టోరీ

ఐసిస్ ఆ పేరు చెబితే ప్రపంచం వణికిపోతుంది కరుడు గట్టిన ఆ ఉగ్రవాదుల పేరు చెబితే ప్రపంచ దేశాలు నిలువెల్లా హడలిపోతాయి. కారణం ఆ అరాచక శక్తులు సాగించే విధ్వంస కాండ మామూలుది కాదు, పచ్చి రక్తాన్ని తాగే మృగాలు నరమాంస భక్షకులు ప్రపంచవ్యాప్తంగా ఐసిస్ ఉగ్రవాదుల హింసాకాండకు, రక్త దాహానికి బలవని దేశం అంటూ లేదు. వారి ఉన్మాద చేష్టలకు హద్దుల్లేవ్ అత్యంత పాశవికంగా గొంతు కోయడం బాంబు దాడులకు పాల్పడటం వారి నైజం. అలాంటి ఐసిస్ ఇప్పుడు వణికిపోతోంది. ఐసీస్ రక్త దాహానికి బలయిన దేశాల్లో మన దేశం కూడా ఒకటి ప్రత్యేకించి యూరప్ దేశాలపై ఐసీస్ ఎప్పటినుంచో కన్నేసింది ముస్లిం రాజ్య స్థాపన పేరుతో ఇరాక్, సిరియాలలో మాటు వేసి నరమేధానికి తెర తీసిన ఈ ఉగ్రసంస్థ మధ్య ప్రాచ్య దేశాల్లో ఇప్పుడు అడుగుపెట్టాలంటే భయపడుతోంది. కరోనా దెబ్బకు తోక ముడిచింది. తాత్కాలికంగా తమ యుద్ధ వ్యూహాలకు విరామం ఇచ్చింది.

కరోనా వైరస్ కు భయపడి తమ బలగాన్ని ఎక్కడి వారినక్కడే ఉండిపోవాలని సలహా ఇస్తోంది. అంతేకాదు తరచుగా చేతులు శుభ్ర పరచుకోవాలని సూచిస్తోంది. అర్ధరాత్రి లేచినా సరే హ్యాండ్ వాషింగ్ తప్పనిసరి అని సూచించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ బలగానికి ప్రయాణాలు మానుకోవాలని అల్ నబా అనే పత్రికలో సలహా ఇచ్చింది. అనారోగ్యంతో ఉన్న వారికి దూరంగా ఉండాలనీ, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఐసిస్ తన వారికి సూచించింది. దేవుడిపై నమ్మకం ఉంచాలని, దేవుడు తాను అంతం చేయాలనుకున్న వారిపైకే వైరస్ ను వదులుతాడని కామెంట్ చేసింది సింహం బారినుంచి తప్పించుకున్నట్లుగా వైరస్ సోకిన వారి నుంచి తప్పించుకు పారిపోవాలని ఓ ఉచిత సలహా కూడా పడేసింది. ముందు జాగ్రత్త చర్యగా ముఖానికి నిరంతరం మాస్క్ తగిలించుకోవాలని, కాచిన వేడి నీటిని మాత్రమే వినియోగించాలని కోరింది. తుమ్ములొస్తే బహిరంగంగా తుమ్మ కుండా మో చేయి అడ్డు పెట్టుకోవాలంది. ఇరాక్ లో ఇప్పటికే 101 కరోనా కేసులు వెలుగు చూడగా దాదాపు 10 మంది చనిపోయారు. యూరప్ ఇప్పుడు కరోనా కేంద్రంగా మారిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే ఐసిస్ కూడా జాగ్రత్త పడింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories