అమెరికా నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తోందా?

అమెరికా నిర్లక్ష్యానికి మూల్యం చెల్లిస్తోందా?
x
Highlights

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది....

కరోనా మహమ్మారి ధాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిల్లాడుతోంది. కొద్ది రోజులుగా అక్కడ మృత్యుఘోష వినిపిస్తోంది. రోజు రోజుకు మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఒక్క రోజులోనే వేల సంఖ్యలో ప్రజలు మరణిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయిన దేశంగా అమెరికా ఇప్పటికే మొదటి స్థానంలో ఉంది. మరి అమెరికా ఎక్కడ ఫెయిల్ అయింది. ఇంత మంది మృత్యుఘోషకు కారణం ఏంటి..? అగ్రరాజ్యానికే పెను సవాల్ గా మారిన ఈ మహమ్మారి ని ఎదుర్కొవడంలో అమెరికా ఎక్కడ వైఫల్యం చెందింది...?

ప్రచండ వేగంతో ప్రపంచాన్ని కమ్మేస్తుంది కరోనా మహమ్మారి. ఇప్పటికే ఈ రాకసి వైరస్ రెండు వందల దేశాలను చుట్టుముట్టింది. ఈ వైరస్ బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మహమ్మారికి ప్రపంచం అంతా అతలాకుతలం అవుతోంది. ఈ వైరస్ అగ్రదేశం అమెరికాను వణికిస్తోంది. ఆ దేశంలో ఇప్పటికే సుమారుగా మూడు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ కొన్ని వేలకిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికాకు వైరస్ కు ఎలా సోకింది. అసలు అగ్రరాజ్యం ఎక్కడ మిస్ అయింది. ఇంటర్నేషనల్ మీడియా ఏం చెబుతోంది.

చైనా దేశం వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. ప్రపంచమంతా కరోనా వైరస్ సోకుతుందటే తమకు ఏం కాదు అన్నట్టు ఉంది అమెరికా. ఆ నిర్లక్ష్యమే అగ్రదేశాన్ని కొంపముంచింది. ఆ మూల్యమే ఇప్పుడు ఆ దేశంలో శవాల దిబ్బాలకు కేరాఫ్ గా నిలిచింది. ఎందుకంత నిర్లక్ష్యం..? విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులతోనే కరోనా వైరస్ సోకుతుందని ప్రపంచ దేశాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ మోత్తుకున్న ట్రంప్ మాత్రం పట్టించుకోలేదని న్యూయార్క్ టైమ్స్ సంస్థ వెల్లడించింది అంతేకాదు విదేశాల నుంచి వచ్చిన వారిని కట్టడి చేయకపోవడమే అమెరికా కరోనా వైరస్ ను కట్టడి చేయలేక పోయిందని ఆ మీడియా సంస్థ ప్రచురించింది.

అమెరికాలో ప్రయాణాలపై ఆంక్షలు విధించక ముందే లక్షల మంది చైనా వాసులు అగ్రరాజ్యంలో అడుగు పెట్టారని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. సుమారు నాలుగు లక్షల ముప్పై వేల మంది చైనా నుంచి నేరుగా అమెరికాలోకి ప్రవేశించగా అందులో వుహాన్ నుంచి వచ్చిన వారి సంఖ్య వేలలో ఉందని న్యూయార్క్ తన కథనంలో పెర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు విధించడానికి ముందే సుమారు 1300 విమానాల్లో నేరుగా చైనా నుంచి అమెరికాలోని 17 నగరాలకు వచ్చినట్టు తెలిపింది. అందులో ఎక్కువ మంది విద్యార్థులు వచ్చినట్టు పేర్కొంది.

న్యూ ఇయర్ కి ముందు కరోనా వైరస్ గురించి చైనా, ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించినా అమెరికా మాత్రం పట్టించుకోలేదని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. విదేశాల నుంచి వచ్చే ప్రయాణ ఆంక్షలు విధించిన తర్వాత కూడా సుమార్ 40వేల మంది అమెరికాలో ప్రవేశించారు. ముఖ్యంగా చైనా నుంచి ప్రయాణికుల తనిఖీల విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడమే ఇందుకు కారణమని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది.

అంతేకాదు.. జనవరిలో మొదటి రెండు వారాల వరకు చైనా నుంచి వచ్చిన ఏ ఒక్కరినీ వైరస్ కు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించలేదని న్యూయార్క్ సంస్థ వివరించింది. ఆ తర్వాత చివరి రెండు వారాల్లో అమెరికా అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది కేవలం లాస్ ఏంజెలెస్, శాన్ ఫ్రాన్సిస్కో, న్యూయార్క్ విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ టెస్ట్‌లు ఏర్పాటు చేసింది. అదీ కూడా వుహాన్ నుంచి వచ్చినవారినే స్క్రీనింగ్ చేశారని తెలిపింది. అప్పటికే అమెరికాలోకి నాలుగు వేల మంది ప్రవేశించారని విమాన ప్రయాణాల డేటా అందించే వారీ ఫ్లైట్స్ డేటా వెల్లడించింది. ఒక్క జనవరి నాటికి అనేక దేశాలకు చెందిన నాలుగు లక్షల ముప్పై వేల మంది చైనా నుంచి అమెరికా వ్యాప్తంగా ఉన్న వివిధ విమానాశ్రయాలకు చేరుకున్నారని న్యూయార్క్ సంస్థ పేర్కొంది.

తాము విధించిన ప్రయాణ ఆంక్షల వల్లే అమెరికాలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టిందని.. అనేక సార్లు అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించుకున్నారు. కానీ, ప్రయాణ ఆంక్షలు పెట్టకపోవడమే.. ఆ విషయంలో కఠినంగా వ్యవహరించకపోవడం వల్లే అమెరికాలో ఈ దారుణమైన పరిస్థితి ఏర్పడిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. మొత్తానికి విదేశాల నుంచి వచ్చిన వారిని స్క్రీనింగ్ చేయకపోవడమే కరోనా వైరస్ కు అగ్రదేశం అతలాకుతలం అవుతోంది..

Show Full Article
Print Article
More On
Next Story
More Stories