Iran Israel War: ఖమేనీ భార్య మన్సౌరే కన్నుమూత.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం!

Iran Israel War: ఖమేనీ భార్య మన్సౌరే కన్నుమూత.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం!
x

Iran Israel War: ఖమేనీ భార్య మన్సౌరే కన్నుమూత.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్ ప్రభుత్వం!

Highlights

Iran Israel War: పశ్చిమ ఆసియాలో యుద్ధం మిగిల్చిన గాయాలు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి.

Iran Israel War: పశ్చిమ ఆసియాలో యుద్ధం మిగిల్చిన గాయాలు ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీశాయి. అమెరికా మరియు ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఖమేనీ భార్య మన్సౌరే ఖోజాస్తే (Mansoureh Khojasteh) చికిత్స పొందుతూ మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధృవీకరించింది.

ఇటీవల ఇరాన్ లక్ష్యంగా అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన భారీ వైమానిక దాడుల్లో ఖమేనీ నివాసం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో మన్సౌరే ఖోజాస్తే తీవ్రంగా గాయపడ్డారు. గత రెండు రోజులుగా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఈరోజు కన్నుమూశారు.

నిర్మూలమైన ఖమేనీ కుటుంబం:

ఈ యుద్ధం ఖమేనీ వంశాన్నే తుడిచిపెట్టేసినంత పని చేసింది. ఇప్పటికే జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ మరణించారు. ఆయన కుమార్తె, అల్లుడు మరియు మనవరాలు కూడా అదే దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. తాజాగా భార్య మన్సౌరే కూడా మృతి చెందడంతో ఖమేనీ కుటుంబంలో ప్రధాన సభ్యులందరూ మరణించినట్లయ్యింది.

సుప్రీం లీడర్ కుటుంబం మొత్తం మరణించడంతో ఇరాన్ ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. దేశవ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. తమ దేశాధినేత కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన ఈ దాడులపై ఇరాన్ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని మరింత ప్రమాదకర స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories