క్షమించండి.. కావాల‌ని కూల్చలేదు: ఇరాన్‌

క్షమించండి.. కావాల‌ని కూల్చలేదు: ఇరాన్‌
x
క్షమించండి.. కావాల‌ని కూల్చలేదు: ఇరాన్‌
Highlights

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఇటీవల ఉక్రెయిన్‌ విమానాన్ని తామే కూల్చినట్లు ఇరాన్‌ మిలిటరీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తాము విమానాన్ని కూల్చలేదని, మానవ...

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లో ఇటీవల ఉక్రెయిన్‌ విమానాన్ని తామే కూల్చినట్లు ఇరాన్‌ మిలిటరీ తెలిపింది. ఉద్దేశపూర్వకంగా తాము విమానాన్ని కూల్చలేదని, మానవ తప్పిదం కారణంగానే అలా జరిగిందని వివరణ ఇచ్చింది. ఉక్రెయిన్‌ విమానం రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన మిలిటరీ కేంద్రం వైపు రావడంతో దాన్ని శత్రు దేశపు విమానంగా భావించామని తెలిపింది. ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని, ఆ సమయంలో విమానం ఆ ప్రాంతంలో కనబడటంతో వెంటనే కూల్చినట్లు ఇరాన్‌ మిలిటరీ వెల్లడించింది. అమెరికా దుస్సాహ‌సం వ‌ల్ల ఏర్పడిన విప‌త్తులో మాన‌వ త‌ప్పిందం జ‌రిగింద‌ని, దాని వ‌ల్లే విమాన కూల్చివేత ఘ‌ట‌న జ‌రిగిన‌ట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి జావ‌ద్ జారిఫ్ త‌న ట్విట్టర్‌లో తెలిపారు. బాధ్యులైన వారిని శిక్షిస్తామ‌ని ఇరాన్ తెలిపింది. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాల‌కు ఇరాన్ మంత్రి సంతాపం తెలిపారు. ప్రజ‌ల‌కు, బాధిత కుటుంబాల‌కు, ప్రభావానికి గురైన అన్ని దేశాల‌కు క్షమాప‌ణ‌లు చెబుతున్నట్లు త‌న ట్వీట్‌లో వెల్లడించారు.

జనవరి 8న ఉక్రెయిన్‌కు చెందిన బోయింగ్ 737 ప్యాసింజర్ విమానం తెహ్రాన్‌లోని ఇమామ్ ఖొమీని ఎయిర్‌పోర్టు నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలింది. ఉక్రెయిన్‌కు వెళ్లాల్సి ఉన్న ఈ విమానం గాల్లోనే పేలిపోయింది. విమానంలో ఉన్న 176 మంది ప్రయాణికులు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 176 మంది(82 మంది ఇరానియన్లు, 11 ఉక్రెయిన్‌ పౌరులు, 10 మంది స్వీడిష్‌ పౌరులు, నలుగురు ఆఫ్గన్లు, ముగ్గురు జర్మన్లు, ముగ్గురు బ్రిటన్‌ పౌరులు. 63 మంది కెనడియన్లు) మరణించారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో సాంకేతిక సమస్యతోనే విమానం కుప్పకూలినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories