Top
logo

ట్రంప్ కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్

ట్రంప్ కు షాక్.. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన ఇరాన్
X
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకీ తీసుకోవడానికి సహాయం...

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఇరాన్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆయనను అదుపులోకీ తీసుకోవడానికి సహాయం చేయాల్సిందిగా ఇంటర్ పోల్ ను అభ్యర్ధించింది. బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇరాన్ అగ్రశ్రేణి జనరల్ సులేమానిని చంపడానికి చేసిన డ్రోన్ దాడిలో అమెరికా అధ్యక్షుడితో పాటు మరికొంత మంది ఉన్నారని, వారిని అదుపులోకి తీసుకోవడానికి ఇరాన్ ఇంటర్పోల్ సహాయం కోరింది.

జనవరి 3న జనరల్ కస్సేమ్ సోలైమానిపై చేసిన దాడిలో ట్రంప్ తో పాటు మరో 30 మందికి పైగా ప్రమేయం ఉందని ఇరాన్ - టెహ్రాన్ ప్రాసిక్యూటర్ అలీ అల్కాసిమెహర్ సోమవారం వెల్లడించినట్లు ఇరాన్ సెమీ-అధికారిక ఇస్నా వార్తా సంస్థ ప్రకటించింది. కాగా ఇరాన్ పెట్టుకున్న అభ్యర్థనకు ఫ్రాన్స్‌లోని లియాన్‌లో ఉన్న ఇంటర్‌పోల్ స్పందించలేదు. ట్రంప్ మరియు ఇతరులకు ఇరాన్ "రెడ్ నోటీసు" ఇవ్వమని కోరినట్లు ఇంటర్ పోల్ ప్రతినిధి అలీ అల్ఖాసిమెర్ వెల్లడించారు.

Web TitleIran issues an arrest warrant for Donald Trump
Next Story