లీప్‌ ఇయర్‌ సంథింగ్‌ స్పెషల్‌ డే.. ఫిబ్రవరిలో 29 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం

లీప్‌ ఇయర్‌ సంథింగ్‌ స్పెషల్‌ డే.. ఫిబ్రవరిలో 29 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం
x
లీప్‌ ఇయర్‌ సంథింగ్‌ స్పెషల్‌ డే
Highlights

ఫిబ్రవరి 29 సంథింగ్‌ స్పెషల్‌. నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే డే. ఏడాదికి 365 రోజులకు గాను ఒక్క రోజు అదనంగా చేరిన ఎక్స్‌ట్రాడే. కేలెండర్‌లో 366 రోజులు...

ఫిబ్రవరి 29 సంథింగ్‌ స్పెషల్‌. నాలుగు ఏళ్లకు ఒకసారి వచ్చే డే. ఏడాదికి 365 రోజులకు గాను ఒక్క రోజు అదనంగా చేరిన ఎక్స్‌ట్రాడే. కేలెండర్‌లో 366 రోజులు కనిపించే ఏకైక సంవత్సరం. అదే లీప్‌ ఇయర్‌ నాలుగేళ్లకు ఒక్కసారి వచ్చే ఈ లీప్‌ ఇయర్‌ పై ప్రతి ఒక్కరిలో ఆసక్తి నెలకొంది. ఆ రోజు పుట్టే పిల్లలు నాలుగు సంవత్సరాలకు ఒకసారి బర్త్ డే చేసుకుంటే మరికొందరు కావాలనే మ్యారేజ్ ఫిక్స్ చేసుకుని మరపురాని అనుభూతులను పొందుతున్నారు. 2020 ఫిబ్రవరి 29న కొందరు గర్భీణీలు డెలివరీ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే ఈ లీప్ సంవత్సరం విషయాని కొస్తే చాలా ఇంట్రెస్టింగ్‌ విషయాలు చెబుతుంటారు. ఇది ఎలా వచ్చిందనే దానికి రకరకాల కారణాలు ఉన్నాయట.

భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతోందని ఇలా ఓ రౌండ్ తిరిగేందుకు 365 రోజుల 5 గంటల 48 నిమిషాల 46 సెకండ్లు పడుతుంది. ఈజీగా చెప్పాలంటే 365 రోజులకు తోడు మరో పావు రోజు పడుతుంది. ఆ పావు రోజును ఒక రోజుగా తీసుకోలేం కాబట్టి ప్రతీ నాలుగేళ్లలో నాలుగు పావు రోజుల్ని కలిపి ఒక రోజుగా మార్చి లీప్ ఇయర్‌లో ఫిబ్రవరి నెలలో అదనపు రోజును చేర్చుతున్నారు.

ఫిబ్రవరిలో 29 రోజులే ఎందుకున్నాయన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం ఉంది. క్రీస్తు పూర్వం గ్రీస్, రోమన్‌లు కేలండర్‌లో రోజుల్నీ, నెలలనూ ఇష్టమొచ్చినట్లు మార్చేసేవాళ్లు. రోం చక్రవర్తిగా జూలియస్ కాసర్ బాధ్యతలు స్వీకరించేటప్పటికి రోమన్ క్యాలెండర్‌‌లో ఏడాదికి 355 రోజులే ఉండేవి. ప్రతీ రెండేళ్లకూ 22 రోజులు ఉన్న ఒక నెల అదనంగా చేరేది. ఆయన ఎంటరయ్యాక కేలండర్‌లో చాలా మార్పులు చేశారు. తద్వారా 365 రోజుల కేలండర్ వచ్చింది. అలాగే ప్రతీ నాలుగేళ్లకూ అదనపు రోజును ఆగస్టు నెలలో కలిపారు. ఫలితంగా అప్పట్లో ఫిబ్రవరికి 30 రోజులు, జులైకి 31 రోజులు, ఆగస్టుకు 29 రోజులు వచ్చాయి.

జూలియస్ కాసర్ తర్వాత కాసర్ ఆగస్టస్ చక్రవర్తి అయ్యాడు. ఆయన పుట్టింది ఆగస్టులో. తాను పుట్టిన నెలలో రోజులు తక్కువగా ఉండటాన్ని ఇష్టపడలేదు. ఆగస్టు నెలకు 2 రోజులు పెంచుకున్నాడు. జూలియస్ కాసర్ ఫిబ్రవరిలో పుట్టాడు కాబట్టి ఫిబ్రవరిలో ఆ రెండు రోజులూ తగ్గించాడు. ఫలితంగా ఆగస్టుకి 31 రోజులు, ఫిబ్రవరికి 28 రోజులూ వచ్చాయి. అప్పటి నుంచీ లీపు సంవత్సరంలో 1 రోజును ఆగస్టుకి కాకుండా ఫిబ్రవరికి కలపడం మొదలుపెట్టారు. ఇప్పట్లో ఈ కేలండర్‌ను మార్చే ఉద్దేశాలు ప్రపంచ దేశాలకు లేదు కాబట్టి ప్రతిసారీ లీప్ ఇయర్‌లో ఫిబ్రవరికి ఎక్స్‌ట్రా వన్‌ డే యాడ్ అవుతుంది.

లీప్‌ సంవత్సరంలో వచ్చే ఫిబ్రవరి 29 ఆ రోజు పుట్టిన రోజు, పెళ్లి రోజు ఇతరత్రా శుభాకార్యాలు జరిపిన వారికి ప్రత్యేకంగా నిలుస్తుంది. ఫిబ్రవరి 29న పుట్టిన వారు నాలుగు సంవత్సరాలకు వచ్చే లీప్‌ సంవత్సరంలో వేడుకలు నిర్వహించుకోవడానికి ఆశగా ఎదురు చూస్తున్నారు. 2020 ఫిబ్రవరి 29న కొందరు గర్భీణీలు డెలివరీ చేసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories