School Building Collapses: ఇండోనేషియాలో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు

School Building Collapses: ఇండోనేషియాలోని సిడోర్జియో మల్టీ మోడల్ ఇస్లామిక్ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది.

Arun Chilukuri
Published on: 30 Sept 2025 11:00 AM IST
School Building Collapses: ఇండోనేషియాలో కుప్పకూలిన స్కూల్ బిల్డింగ్.. శిథిలాల కింద 65 మంది విద్యార్థులు
X

School Building Collapses: ఇండోనేషియాలోని సిడోర్జియో మల్టీ మోడల్ ఇస్లామిక్ స్కూల్ బిల్డింగ్ కుప్పకూలింది. ప్రార్థన కోసం 100 మంది విద్యార్థులు ఒకే దగ్గర గుమికూడారు. ఒక్కసారిగా బిల్డింగ్ కుప్పకూలడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. బిల్డింగ్ శిథిలాల కింద 65 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. రెస్య్కూ ఆపరేషన్ చేపట్టి 8 మందిని రక్షించారు. ఇంకా పలువురి ఆచూకీ గుర్తించలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. తీవ్రంగా గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ దగ్గరికి చేరుకుని తమ పిల్లల ఆచూకీ తెలపాలని కోరుతున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story