Rini Sampath: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారత సంతతి మహిళ: ఎవరీ రినీ సంపత్?

Rini Sampath: వాషింగ్టన్ డీసీ మేయర్ రేసులో భారత సంతతి మహిళ: ఎవరీ రినీ సంపత్?
Rini Sampath: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తులు మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు.
Rini Sampath: అగ్రరాజ్యం అమెరికా రాజకీయాల్లో భారత సంతతి వ్యక్తులు మరోసారి సంచలనం సృష్టిస్తున్నారు. వాషింగ్టన్ డీసీ మేయర్ పదవి కోసం తమిళనాడుకు చెందిన 31 ఏళ్ల రినీ సంపత్ బరిలోకి దిగారు. ఎటువంటి రాజకీయ పార్టీ మద్దతు లేకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఆమె పోటీ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులోని తేని నగరానికి చెందిన రినీ సంపత్, తన ఏడేళ్ల వయసులో తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లారు. అక్కడే విద్య, ఉద్యోగ రంగాల్లో రాణించిన ఆమె, విద్యార్థి దశ నుంచే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే ఏజెన్సీ నిర్వాహకురాలిగా పని చేస్తూ క్షేత్రస్థాయి సమస్యలపై పూర్తి అవగాహన పెంచుకున్నారు.
ప్రజల గొంతుకగా రినీ:
వాషింగ్టన్ నగరంలో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలపై రినీ సంపత్ గళమెత్తారు.
911 ఎమర్జెన్సీ సేవలు: అత్యవసర సమయంలో కాల్ సెంటర్లు ఆలస్యంగా స్పందించడాన్ని ఆమె ప్రశ్నించారు.
పర్యావరణం: పోటోమాక్ నదిలో కలుస్తున్న మురుగునీటి సమస్యను తెరపైకి తెచ్చారు.
భద్రత: మంచు తుపాను సమయాల్లో ప్రమాదకరంగా మారుతున్న కాలిబాటల గురించి అధికారులను నిలదీశారు.
'కొత్త వాషింగ్టన్' నిర్మాణమే లక్ష్యం:
"నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు.. నా వెనుక ఏ శక్తులు లేవు. కేవలం సామాన్య ప్రజల పక్షాన నిలబడి 'కొత్త వాషింగ్టన్' నిర్మించడమే నా లక్ష్యం" అని రినీ స్పష్టం చేశారు. నగరంలో జీవన వ్యయాన్ని తగ్గించడం, సత్వర ప్రజా సేవలే తన ప్రధాన ఎజెండా అని ఆమె హామీ ఇస్తున్నారు.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



